NewsOrbit
Cinema Entertainment News న్యూస్ సినిమా

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

Aparna Das: ఒకప్పుడు హీరోయిన్లు త్వరగా పెళ్లి చేసుకునేందుకు మక్కువ చూపేవారు కాదు. ఎందుకంటే అప్పట్లో వివాహం తర్వాత హీరోయిన్లకు ఇండస్ట్రీలో కెరీర్ ఉండేది కాదు. సహాయక పాత్రల కోసమే వారిని తీసుకునేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. చాలా మంది హీరోయిన్లు పెళ్లై పిల్లలు పుట్టిన తర్వాత కూడా సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను రన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పలువురు తారలు ఒక వయసు రాగానే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో మరొక బ్యూటీ చేరేందుకు సిద్ధం అవుతోంది. ప్రముఖ నటి అపర్ణ దాస్ చిన్న వయసులోనే ఓ ఇంటిది కాబోతోంది.

అపర్ణ దాస్ మలయాళ సినీ ప్రియులకు అత్యంత సుప్రసిద్ధురాలు. అలాగే తమిళ్, తెలుగు ప్రేక్షకులకు కూడా ఆమె సుపరిచితమే. 1995 ఒమన్ లోని మస్కట్ లో స్థిరపడిన మలయాళ కుటుంబంలో అపర్ణ జన్మించింది. కాలేజీ రోజుల్లో అపర్ణ మోడలింగ్ లోకి ప్రవేశించింది. పలు సంస్థలకు మరియు పత్రికలకు మోడల్ గా వర్క్ చేసింది. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ పూర్తి చేసిన తర్వాత ఓ సంస్థ‌లో ఆమె అకౌంటెంట్‌గా కొద్ది రోజులు ఉద్యోగం చేసింది. 2018లో సత్యన్ అంతికాడ్ రూపొందించిన సెటైరిక‌ల్ కామెడీ చిత్రం న్జన్ ప్రకాశన్ తో అప‌ర్ణ సినీ రంగ ప్ర‌వేశం చేసింది. ఇందులో గుర్తింపులేని పాత్ర‌లో న‌టించింది.

2019లో మనోహరం అనే చిత్రంలో వినీత్ శ్రీనివాసన్ సరసన కథానాయికగా నటించింది. త‌న స‌హ‌జ న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించి వెండితెర‌పై గుర్తింపు సంపాదించుకుంది. 2022 బీస్ట్ మూవీతో అప‌ర్ణ కోలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ద‌ళ‌ప‌తి విజ‌య్‌, పూజా హెగ్డే జంట‌గా న‌టించిన ఈ చిత్రానికి నెల్సన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇందులో హోం మినిస్ట‌ర్ కుమార్తె మరియు ఒక ఐపీఎస్ ట్రైనీ పాత్ర‌లో అప‌ర్ణ క‌నిపించింది. 2023లో వ‌చ్చిన దాదా మూవీతో అప‌ర్ణకు బిగ్ బ్రేక్ వ‌చ్చింది.

గణేష్ కె. బాబు దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ కామెడీ డ్రామాలో కవిన్ మరియు అపర్ణా దాస్ ప్రధాన పాత్రలు పోషించారు. ఎలాంటి అంచ‌నాలు లేకుండా వ‌చ్చిన దాదా మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద భారీ విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాతో అప‌ర్ణ భారీ క్రేజ్ సంపాదించుకుంది. అప‌ర్ణ తెలుగులో ఒక సినిమా చేసింది. వైష్ణ‌వ్ తేజ్ హీరోగా గ‌త ఏడాది విడుద‌లైన ఆదికేశ‌వ చిత్రంలో అప‌ర్ణ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించింది. ప్ర‌స్తుతం ఆనంద్ శ్రీబాల అనే మ‌ల‌యాళ మూవీలో అప‌ర్ణ దాస్ యాక్ట్ చేస్తోంది.

ఇదిలా ఉంటే.. మ‌రికొన్ని గంట‌ల్లో అప‌ర్ణ వైవాహిక జీవితంలోకి అడుగు పెట్ట‌బోతోంది. 2024 ఏప్రిల్ 24న ప్ర‌ముఖ మ‌ల‌యాళ నటుడు దీపక్ పరంబోల్ ను అప‌ర్ణ వివాహం చేసుకోబోతోంది. 28 ఏళ్ల‌కే ఏడ‌డుగులు వేయ‌బోతోంది. హీరోయిన్ అప‌ర్ణ చేసిన డెబ్యూ మూవీ మనోహరంలో దీప‌క్ కూడా న‌టించాడు. ఈ సినిమా షూటింగ్ స‌మ‌యంలో ఇద్ద‌రి మ‌ధ్య ఏర్ప‌డిన ప‌రిచ‌యం ప్రేమ‌గా మారింది. ఇప్పుడు అప‌ర్ణ మ‌రియు దీప‌క్ త‌మ బంధాన్ని మ‌రింత ముందుకు తీసుకెళ్ల‌బోతున్నారు. పెద్ద‌ల అంగీకారంతో రేపు పెళ్లి పీట‌లెక్కేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా అప‌ర్ణ దాస్ హ‌ల్దీ వేడుక ఘ‌నంగా జ‌రిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతోంది.

https://www.instagram.com/aparna.das1/?utm_source=ig_embed&ig_rid=9dae7b0e-0448-43f6-9f82-22affddfdd84

Related posts

శ్రీ ఎం ఆశ్రమంలో శ్రీ గురు మహావతార్ బాబాజీ ఆలయ గ్రాండ్ ఓపెనింగ్ 

Deepak Rajula

YSRCP: తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత .. బాబు సర్కార్ పై జగన్ ఆగ్రహం

sharma somaraju

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

AP Assembly: ఏపీ శాసనసభ స్పీకర్ గా నేడు బాధ్యతలు చేపట్టనున్న అయ్యన్న .. అనూహ్య నిర్ణయం తీసుకున్న వైసీపీ..!

sharma somaraju

Salar Jung Reforms: Important Points to Remember for TGPSC Group 1 and Group 2 Exams 2024

Deepak Rajula

YS Jagan: ఓటమితో అధైర్యపడవద్దు – క్యాడర్ కు తోడుగా నిలిచి భరోసా ఇవ్వండి: వైసీపీ నేతలకు జగన్ సూచన  

sharma somaraju

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు .. ఇకపై కొత్త చంద్రబాబును చూస్తారంటూ..

sharma somaraju

Chirajeevi – Pawan Kalyan: చిరు ఇంటికి పవన్ .. ‘మెగా’ సంబురం

sharma somaraju

ఏపీ గవర్నర్ కు ఎన్నికైన ఎమ్మెల్యే జాబితాను అందజేసిన సీఈవో .. గెజిట్ నోటిఫికేషన్ విడుదల

sharma somaraju

Modi – Pawan Kalyan: కుటుంబ సమేతంగా మోడీని కలిసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

ప్రధాని మోదీ పరిస్థితిపై కాంగ్రెస్ వ్యంగ్య చిత్రం .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N