Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో అత్యధికంగా నెగెటివిటీ ఎదుర్కొన్న కంటెస్టెంట్ రతిక. ఈ షో ప్రారంభమయ్యాక 12 మంది సభ్యుల హౌస్ లో ఎంట్రీ ఇచ్చాక మొదటి వారం బాగా ఆడిన కంటెస్టెంట్ గా వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున చేత శభాష్ అనిపించుకోవడం జరిగింది. కానీ రెండోవారం వచ్చేసరికి రతిక తన అసలు స్వరూపం బయటపెట్టింది. ఎదుట వారి ఫీలింగ్స్ రెచ్చగొట్టే విధంగా.. గేమ్ ఆడుతూ కెమెరా ఫోకస్ తనపై ఉండేలా వ్యవహరించింది. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ నీ టార్గెట్ చేసి… గొడవలు కావాలని పెట్టుకోవడం వంటివి చేసి చాలా బ్యాడ్ అయ్యింది.
ఈ విషయంలో నాగార్జున హౌస్ లో గేమ్ ఆడు అంతేగాని ఎదుట వారి ఫీలింగ్స్ తో ఆడుకోకూడదని వీకెండ్ ఎపిసోడ్ లలో క్లాస్ పీకించుకోవడం జరిగింది. అయినా గాని ఆమె ఆట తీరులో ఎక్కడ మార్పు రాలేదు. ఇంకా మనుషుల ముందు ఒకలాగా లేనప్పుడు మరొక్కలాగా మాట్లాడి.. చాలా నెగిటివ్ సంపాదించుకొని నాలుగో వారం హౌస్ నుండి ఎలిమినేట్ అయింది. రతిక ఎలిమినేషన్ బిగ్ బాస్ ఆడియన్స్ చాలా బాగా ఎంజాయ్ చేశారు. హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యాక రతిక కూడా తన ఆట తీరు పట్ల రియలైజ్ అయ్యి.. రీయంట్రీ ముందు గతం లాగా తాను ఆడనని స్పెషల్ వీడియో పోస్ట్ చేసింది.
కానీ ఇప్పుడు హౌస్ లోకి వచ్చాక మళ్ళీ పాత ఆట కొనసాగిస్తూ ఎదుటివారి ఫీలింగ్స్ రెచ్చగొడుతూ ఉంది. దీంతో వైల్డ్ కార్డు ఎంట్రీ లో వచ్చిన అర్జున్.. రతిక ఆట తీరు పట్ల సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆమెను చూస్తుంటే మళ్ళీ పుల్లలు పెట్టడానికి వచ్చినట్టుందని వ్యాఖ్యానించాడు. ఆ ముగ్గురు శివాజీ, ప్రశాంత్, యావర్ ల మధ్య..గొడవ పెట్టే ప్రయత్నాలు చేస్తుందని చెప్పుకొచ్చారు. దీనితో అర్జున్ విశ్లేషణ చాలా కరెక్ట్ అని బిగ్ బాస్ ఆడియన్స్ కామెంట్లు చేస్తున్నారు.