22.7 C
Hyderabad
March 26, 2023
NewsOrbit
Entertainment News సినిమా

ఐదేళ్ల త‌ర్వాత బ‌య‌ట‌కు వ‌చ్చిన `అర్జున్ రెడ్డి` డిలీటెడ్‌ సీన్‌.. నెట్టింట వైర‌ల్‌!

Share

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ కెరీర్‌లో ఎప్ప‌టికీ గుర్తిండి పోయే చిత్రాల్లో `అర్జున్ రెడ్డి` మొద‌టి స్థానంలో ఉంటుంది. సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో షాలిని పాండే హీరోయిన్‌గా న‌టించింది. రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, జియా శర్మ, సంజయ్ స్వరూప్, గోపినాథ్ భట్ త‌దిత‌రులు ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

భద్రకాళి పిక్చర్స్ బ్యాన‌ర్‌పై ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించిన ఈ చిత్రం.. 2017 ఆగ‌స్టు 25న విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది. ఇదో యూత్‌ఫుల్ ల‌వ్ ఎంట‌ర్టైన‌ర్‌. బోల్డ్ స‌న్నివేశాలు ఉన్న‌ప్ప‌టికీ కంటెంట్, హీరో యాటిట్యూడ్‌ ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకున్నాయి. సాంగ్స్‌, బ్యాక్‌గ్రైండ్ మ్యూజిక్ కూడా సినిమా హిట్ అవ్వ‌డానికి ఎంత‌గానో హెల్ప్ చేశాయి.

ఈ సినిమాతోనే విజ‌య్ దేవ‌ర‌కొండ ఓవ‌ర్ నైట్ స్టార్ అయ్యాడు. మ‌రోవైపు సందీప్ రెడ్డి వంగాకు కూడా స్టార్ హోదా ద‌క్కింది. ఇక‌పోతే ఈ సినిమా విడుద‌లై నిన్న‌టితో ఐదు సంవ‌త్సరాలు పూర్తి అయ్యాయి. ఈ నేప‌థ్యంలోనే డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి వంగా `అర్జున్ రెడ్డి` మూవీలోని ఓ డిలీటెడ్ సీన్‌కు బ‌య‌ట‌కు వ‌దిలారు. ఈ వీడియోలో రాహుల్ రామకృష్ణ, విజయ్ మధ్య సంభాషణలు చూపించారు.

చాలా రోజుల తర్వాత ప్రీతిని కలిసేందుకు వెళ్ళినప్పుడు అర్జున్ ఆనందంలో ఆమెను ముద్దు పెట్టుకోవడం, అది చూసి ప్రీతి తండ్రి గొడవ పడటంపై విజయ్‌- రాహుల్ లు చ‌ర్చించుకుంటారు. `ప్రీతి అంటే నీకు చందమామ, చుక్కలంత లవ్ అంటున్నావ్. కానీ వాళ్ళ నాయనకి మిల్కీవే గ్యాలక్సీ కంటే తక్కువ ప్రేమ లేదురా. వాడు నా ప్రేమకి అడ్డం పడుతున్నాడు అని అనుకున్నావా? వాడు నీ ప్రేమకి అడ్డం పడబట్టే అతనకు కూతురు మీద ఎంత ప్రేమ ఉందో కనిపిస్తుంది. ఇందులో నీ కోపం ఒక్కటే నీకు శత్రువు` అంటూ తన కూతురు మీద తండ్రి చూపించే ప్రేమ గురించి రాహుల్ రామకృష్ణ చక్కగా వివ‌రించారు. మొత్తానికి ఆక‌ట్టుకుంటున్న ఈ డిలీటెడ్ సీన్ నెట్టింట వైర‌ల్‌గా మారింది.


Share

Related posts

Raai Lakshmi: చ‌లికాలంలోనూ చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న ల‌క్ష్మీ రాయ్‌..ఇక కుర్రాళ్ళ‌ను ఆప‌డం క‌ష్ట‌మే!

kavya N

వెరైటీ కామెంట్ తో పవన్ కళ్యాణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన తమన్..!!

sekhar

Pushpa 2: “పుష్ప 2” లో హైలెట్ సన్నివేశం ఇండస్ట్రీలో హాట్ టాపిక్..?

sekhar