Allu Arjun: పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం “18 పేజీస్”. ఈ సినిమానీ జీఏ 2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు రూపొందించాయి. డిసెంబర్ 23వ తారీకు “18 పేజీస్” రిలీజ్ కానుంది. ఈ క్రమంలో సోమవారం ఈ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా ఐకాన్ స్టార్ బండి హాజరయ్యారు. “18 పేజీస్” సినిమా యూనిట్ నీ అభినందించారు. దక్షిణాది సినిమాలు బాలీవుడ్ లో సక్సెస్ కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. “పుష్ప 2” అసలు తగ్గేదేలే అని అన్నారు. ఇండియన్ సినిమా ప్రస్తుతం దక్షిణాది సినిమాల వైపు చూస్తూ ఉంది. ఇలాంటి సమయంలో మంచి సినిమాలతో ఎంతైనా ఆకట్టుకోవాల్సి ఉంది అని సూచించారు.

ఈ సినిమాని నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తులు నిర్మించారు. అందులో నా డైరెక్టర్ నా ఫ్రెండ్ నా శ్రేయోభిలాషి ఈ సినిమా నిర్మాత సుకుమార్. నా హృదయానికి సుకుమార్ ఎంతో దగ్గర అయిన వాడు. సుకుమార్ లేకపోతే నా జర్నీ ఇలా ఉండేది కాదని.. ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను. ప్రస్తుతం ఈ పొజిషన్ లో ఉండటానికి సుకుమార్ ప్రధానమైన వ్యక్తి. దానికి ఎప్పుడు సుకుమార్ పై కృతజ్ఞత… ప్రేమ… గౌరవం నాకు ఉంటుంది. అలాగే మరో నా క్లోజ్ ఫ్రెండ్ బన్నీ వాసు. నా పేరులో వాసు ఉండదు. కానీ నా పేరును తన పేరులో చేర్చుకున్నాడు. తనని ఫ్రెండ్ అనాలో… బ్రదర్ అనాలో.. గైడ్ అనాలా. అటువంటి వాసు.. సుకుమార్ ఇద్దరు నాకిష్టమైన వాళ్ళు.

వీరిద్దరూ కలిసి సినిమా చేస్తుంటే ఈ సినిమాకి నేను తప్ప మరొకరు ఈ వేడుకకి ఎవరు వస్తారు. ఇక ఇదే సమయంలో మా నాన్న అరవింద్ గారికి థాంక్స్ చెప్పలి. ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేయడానికి భారీ ఆఫర్స్ వచ్చాయి. కానీ సొంతంగా ఓటీటీ ఉన్న థియేటర్ లోనే రిలీజ్ చేస్తాను. ఎందుకంటే ప్రేక్షకులు థియేటర్ కి వచ్చే సంస్కృతిని పాడు చేయను. జనాలు సినిమాను థియేటర్స్లో చూడాలనే ఉత్సాహం పోకూడదనే సంస్కృతికి ఆయన సపోర్ట్ చేస్తున్నారు. ఆయన నా తండ్రే కాదు.. సినిమా అంటే ప్రేమ ఉన్న నిర్మాత. అందుకే ఆయనంటే నాకు రెస్పెక్ట్. అలాగే ఈ సినిమా గురించి అనేక విషయాలు తెలియజేస్తూ డైరెక్టర్ మరియు హీరో హీరోయిన్ లకి ఆల్ ది బెస్ట్ అని బన్నీ తన స్పీచ్ ముగించారు.