Avunu Valliddaru Ishta Paddaru: కళావతి తో మనోజ్ లగ్గం ఖాయం చేస్తారు పెద్దలు. కళావతి మనోజ్ కి గిఫ్ట్ ఇవ్వడం. మనోజ్ రిటర్న్ గిఫ్ట్ గా ఢిల్లీ రాసిన కవితల బుక్ ఇస్తాడు.. అలా నీకు కాబోయే భార్యకి మీ తమ్ముడు రాసిచ్చిన బుక్ ఇవ్వడం కరెక్ట్ కాదని వాళ్ళ అమ్మ అనడంతో.. ఇక పరుగు పరుగున కళావతి దగ్గరికి వెళ్తాడు ఆ బుక్ తనకు ఇవ్వమని అడుగుతాడు.. ఎందుకు అడుగుతున్నావు అని కళావతి అడుగుతుంది..

నీకు ఇచ్చిన ఆ బుక్ లో కవితలు నేను రాసినవి కాదు.. మా అన్న ఢిల్లీ రాసినవి అని అనగానే .. కళావతికి కోపం వచ్చి ఆ బుక్ నేల మీద విసురు కొడుతుంది. నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థం అవుతుందా అంటూ మనోజ్ కి చివాట్లు పెట్టి పంపిస్తుంది. ఇక ఆ బుక్ తీసుకొచ్చి మనోజ్ ఢిల్లీకి ఇస్తాడు. ఏమైందిరా అలా ఉన్నావు ఈ బుక్ మళ్ళీ ఎందుకు తీసుకొచ్చావు అని అడుగుతాడు. రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళ దగ్గర నుంచి మళ్లీ ఈ బుక్ రిటన్ తీసుకు వచ్చావా అని నవ్వుతూ మాట్లాడతాడు. ఢిల్లీ నీకు చాలా ఈజీగా ఉందన్న కానీ నేను అలా తీసుకోలేకపోతున్నాను అంటూ మనోజ్ బాధపడతాడు.

తన తమ్ముడి కళ్ళల్లో నీళ్లు చూసిన ఢిల్లీ నువ్వు ఏం బాధపడకు నేనే ఏదో ఒకటి సెట్ చేస్తాను అని ఢిల్లీ అంటాడు. ఈరోజు నువ్వు నాకు లాగా కళావతి దగ్గరికి వెళ్లి మా ఇద్దరి మధ్య ఉన్న మనస్పర్ధలు అని క్లియర్ చేయాలి అని మనోజ్ ఢిల్లీని సహాయం కోరుతాడు. నువ్వు అలా బాధపడకు నేను ఏదో ఒకటి సెట్ చేస్తాను అని ఢిల్లీ అంటాడు .
ఇక కళావతి ఎక్కడుందో తెలుసుకొని ఢిల్లీ గుడికి వెళ్తాడు. అక్కడే కళావతి చెల్లెలు కనిపించి మా అక్క నీ మీద బెంగ వేసుకున్నట్టుంది. లేదంటే మీరిద్దరూ ఏమైనా గొడవ పడ్డారని అడుగుతుంది. అలాంటివి ఏమీ లేవు అని మనోజ్ లో గెటప్ లో ఉన్న ఢిల్లీ సమాధానం చెబుతాడు. నిన్నటి నుంచి మా అక్క పచ్చి మంచినీళ్లు కూడా మొట్టలేదని.. మీరే తనని సముదాయించి ఏదో ఒకటి తినేలాగా చేయమని తన చెల్లెలు కోరుతుంది. ఇక గుడిలో కూర్చున్న తన అక్క దగ్గరకు తీసుకువెళ్లి అక్కడి నుంచి తను వెళ్ళిపోతుంది. ఢిల్లీ మనసులో నా తమ్ముడు మనోజ్ నీ గురించి బాధపడుతున్నాడు. పెళ్లి వద్దనుకున్న నేను మొదటి చూపులోనే నిన్ను చూసి ప్రేమించాను. నా పరిస్థితి ఎటు కాకుండా ఉంది అని అనుకుంటాడు..
గుడిలో కూర్చుని ఉన్న కళావతి దగ్గరికి వెళ్లి మనోజ్ ప్రసాదం తినమని తినిపిస్తాడు.. ఐ యాం సారీ నేను నిన్న మిమ్మల్ని చాలా బాధ పెట్టాను.. ఇదంతా ఆ ఢిల్లీ వల్లేనే అని కళావతి అంటుంది. నేను మీకు ఒక విషయం చెప్పాలి .. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను.. మీరంటే నాకు చాలా ఇష్టం.. ఒక్క మాటలో చెప్పాలంటే మీరే నా జీవితం అని కళావతి అనగానే.. మనోజ్ కన్నీళ్లు పెట్టుకుంటాడు.