Avunu Valliddaru Ista Paddaru: మనుషుల మాట్లాడుతున్న ఢిల్లీకి కళావతి ఫోన్ చేసి ఒక ప్లేస్ కి రమ్మని చెబుతుంది. మనోజ్ గెటప్ లో ఢిల్లీ అక్కడికి వస్తాడు. జుట్టు పంచ కట్టుకుని దీన్ని మనోజ్ వాయిస్ తో మేనేజ్ చేస్తూ ఉంటాడు కానీ మళ్ళీ చూస్తుంటే నా ఆ ఢిల్లీని చూస్తున్నట్లే అనిపిస్తుంది మీరు నన్ను కలవడానికి ఎప్పుడు వచ్చినా ఈ బ్లాక్ స్పెడ్స్ ని పెట్టుకుంటారు ఎందుకు అని కళావతి ప్రశ్నిస్తుంది ఢిల్లీ మేనేజ్ చేయలేక చచ్చిపోతూ ఉంటాడు..

Avunu Valliddaru Istapaddaru: పూజ కి అలా దగ్గరవుతున్న మనోజ్.. కళావతి చూసేసిందా.!?
అంతలో ఢిల్లీ మచ్చ అంటూ చిట్టి పిలుస్తుంది. ఏంది ఢిల్లీ మచ్చా ఎవరు ఈ పాప అని అడగగానే కళావతి అని చెబుతాడు. ఏంది ఈ పాప కళావతి అయితే నేను ఎవరు.. నన్ను కాదు అనుకుని ఈ అమ్మాయిని తన లాగా మాట్లాడటానికి మాట్లాడుతున్నావా.. ఇది అన్యాయం వచ్చా అంటూ కళావతి ముందే ఢిల్లీ మనోజ్ దగ్గర కళావతి లాగా మ్యానేజ్ చేస్తున్న సంగతి ఇన్ డైరెక్ట్ గా మాట్లాడుతుంది. ఇదంతా వద్దులే గానీ నా డబ్బులు నాకు ఇవ్వు అని సస్పెన్స్ క్రియేట్ చేసి అక్కడ నుంచి చిట్టి వెళ్ళిపోతుంది. హమ్మయ్య గండం గట్టెక్కిందని ఢిల్లీ ఊపిరి పీల్చుకుంటాడు.

చూసావా ఆ ఢిల్లీ ఎలాంటి వంకర పనులన్నీ చేస్తూ ఉంటాడు అందుకే తన పేరు తలుచుకోవాలన్నా కూడా నాకు ఒళ్ళంతా కంపరంగా ఉంటుంది అని కళావతి ఢిల్లీని తిడుతూ ఎదురుగా ఆ మాటలు వింటున్న మనోజ్ లాగా ఉన్న ఢిల్లీ ఇబ్బంది పడుతూ ఉంటాడు అందులో ఎవరో ఒక ఆవిడకి యాక్సిడెంట్ అవుతుంది. గబగబా పరిగెత్తుకుంటూ వెళ్లి పంచె తీసి ఆమె ఒంటికి కప్పుతాడు. మనోజ్ లాగా ఉన్న ఢిల్లీ ఇప్పుడు హ్యాపీ నా అని ఢిల్లీ కొంటెగా కవ్విస్తాడు. లోపల షార్ట్ ట్రాక్ వేసుకున్నాను కాబట్టి సరిపోయింది అని కళావతి తో నవ్వుతూ కబుర్లు చెబుతాడు.

ఇక రేపటి ఎపిసోడ్ లో ఢిల్లీ ఇంటికి వెళ్లేసరికి ఇంట్లో వాళ్ళందరూ గుమ్మంలో ఎదురుచూస్తూ ఉంటారు. ఢిల్లీ ఇంట్లోకి కాళ్లు పెట్టడం తనే వాళ్ళ నాన్న నువ్వు ఇంట్లోకి రావడానికి వీల్లేదు. ఇంట్లో నుంచి బయటికి పొమ్మని తన బ్యాగ్ తీసి బయట విసిరేస్తాడు. రెండు రోజుల్లో వాళ్ళ అన్నయ్య పెళ్లి పెట్టుకొని ఇప్పుడు బయటకు పొమ్మంటే ఎలా పోతాడు అంటూ ఢిల్లీని ఆపడానికి ప్రయత్నిస్తారు.. అసలు ఢిల్లీ ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి కారణం ఏంటో అనేది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం.