Avunu Valliddaru Ista Paddaru: మూడుముళ్ల బంధంతో రెండు మనసులను ఒకటి చేసేది పెళ్లి.. అంతేకాదు రెండు కుటుంబాలను కూడా ఈ పెళ్ళే కలుపుతుంది.. శత్రుత్వం ఉన్నవాళ్లు కూడా పెళ్లి దగ్గర మిత్రులుగా మారిపోక తప్పదు అంటారు పెద్దలు.. ఇప్పుడు అదే జరుగుతోంది ఈ కథలో.. నిన్న మొన్నటి వరకు ఢిల్లీ అంటే విరుచుకుపడిన కళావతి కూడా తన కట్టిన తాళ్ళకి విలువ ఇవ్వాలని అమ్మ ఇచ్చిన సలహా మేరకు కాపురానికి వస్తుంది కళావతి..

మరోవైపు ఊరు పెద్దలు అందరినీ తీసుకొని మనోజ్ ఇంటికి వస్తారు. రెడ్డప్ప, ప్రమీల కూతురుని కాపురానికి తీసుకొచ్చామని వాళ్లు మనోజ్ వాళ్లతో చెబుతారు. ఈ పెళ్లి గురించి ఆలోచించమని చెబుతారు . ఆడపిల్ల జీవితాన్ని మధ్యలో ఇలా అన్యాయం చేయొద్దు అని.. మంచి భవిష్యత్తు ఇవ్వమని జరిగిందేదో జరిగిపోయింది అని చెబుతారు. దానికి మనోజ్ తండ్రి ఒప్పుకుంటాడు . మనోజ్ మాత్రం ఒక కండిషన్ పెట్టి పూజ ఇంట్లో ఉండడానికి ఒప్పుకుంటాడు.
అదేంటంటే వాళ్ళ అమ్మ ప్రమీల వాళ్ళ మామ రెడ్డప్ప జన్మలో ఈ ఇంటి గడప తొక్కకూడదు అని కండిషన్ పెడతాడు . ఆ కండిషన్ కి ప్రమీల ఒప్పుకుంటుంది. ఏడుస్తూ చివరిసారిగా పూజకి జాగ్రత్తలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరోవైపు రెడ్డప్ప కూడా తన మేనకోడల్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

కళావతిని తీసుకొని తన కుటుంబ సభ్యులు రావడంతోనే ఇంటికి వదిన వచ్చింది అంటూ దయానంద్ కుటుంబం వాళ్ళు సంతోషిస్తారు . కళావతి ఇంట్లోకి రావడంతోనే సుగుణ హారతి ఇస్తుండగా.. సుగుణ వాళ్ళ అత్తయ్య అబ్బోడా.. నువ్వు కూడా రా.. కళావతి పక్కన ఢిల్లీని నిలబెట్టి ఇద్దరికీ కలిపి హారతి ఇస్తారు. అంతేకాకుండా కళావతికి బొట్టు పెట్టమని కూడా చెబుతుంది వాళ్ళ నానమ్మ. ఇక కళావతి ఏమనుకుంటుందో అని భయం భయంగా కళావతికి నుదిటిన బొట్టు పెడతాడు ఢిల్లీ .
ఇక తన కూతురు కళావతిని మీరే జాగ్రత్తగా చూసుకోవాలని పద్మావతి వాళ్లందరినీ రిక్వెస్ట్ చేస్తుంది. మరోవైపు జయరాం కూడా దయానందుని తన కూతురు కాస్త మొండిదని.. కాకపోతే చాలా మంచి మనిషి అని ఇక నుంచి తనకు అన్నీ మీరే అని చెప్పి అక్కడి నుంచి కళావతి పేరెంట్స్ కూడా వెళ్ళిపోతారు.