Avunu Valliddaru Ista Paddaru: ఢిల్లీ ఉదయాన్నే తన స్నేహితులతో కలిసి వారికి వెళ్తాడు కళావతి తనని ఇష్టపడుతుందంటూ.. తన ఫ్రెండ్స్ తో చెబుతూ ఉంటాడు. అంతేకాకుండా కళావతితో తను దిగిన ఫోటోని తన ఫ్రెండ్స్ కు చూపిస్తారు. అంతలో ఒక అతను వచ్చి ఎవరు బాసు ఈ అమ్మాయి.. నాకు సెట్ చేసి పెట్టు మంచి డబ్బులు ఇస్తాను అని అంటాడు.. ఏం కోతలు కోస్తున్నావ్ రా నువ్వు అంటూ.. ఢిల్లీ తనని కొడతాడు. దాంతో మాట మాట పెరిగి పెద్ద గొడవే జరుగుతుంది.. దాంతో ఢిల్లీని తన ఫ్రెండ్స్ అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతారు.

Avunu Valliddaru Istapaddaru: పూజ కి అలా దగ్గరవుతున్న మనోజ్.. కళావతి చూసేసిందా.!?
ఆ తర్వాత కాసేపటికి మనోజ్ పెళ్లి విషయం గురించి ఇంట్లో వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా.. పోలీస్ జీప్ వచ్చి వాళ్ళ ఇంటి ఎదురు ఆగుతుంది. పోలీస్ ఆఫీసర్ వచ్చి ఢిల్లీ లాగా ఉన్న మనోజ్ ని పోలీస్ స్టేషన్ కి రమ్మని తీసుకెళ్తుంది. అసలు ఏం జరిగిందో చెప్పమని ఢిల్లీ వాళ్ళ నాన్న అడుగుతాడు. నీ కొడుకు ఏం చేశాడో నీకు తెలియదా .. పిల్లల్ని కనేసి రోడ్డు మీదకు వదిలేసావు. మందు తాగి ఎవరిని పడితే వాళ్లను కొట్టడమేనా కొడితే అందరూ ఊరుకుంటారా అంటూ.. ఆ పోలీస్ ఆఫీసర్ జరిగిందంతా చెబుతుంది.

కానీ ఇతను మా మనోజ్ అండి .. ఢిల్లీ కాదు అని చెబుతారు . ఇంతకుముందు కూడా ఢిల్లీ అనుకొని మా మనోజ్ ని ఎత్తుకెళ్లారు ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు అంటూ మనోజ్ ని తీసుకు వెళ్ళద్దని ఇంట్లో వాళ్ళందరూ చెబుతూ ఉంటారు. అలా అయితే ఢిల్లీని తీసుకొచ్చి నాకు అప్పచెప్పండి అప్పుడే మనోజ్ ని వదిలిపెడతాను అని అంటారు. మనోజ్ పేరెంట్స్ మాత్రం తనని తీసుకువెళ్లొద్దు అంటూ పోలీసుల కాలవేల పడతారు.. కానీ వాళ్ళు కనికరించకుండా మనోజ్ ను అక్కడ నుంచి తీసుకువెళ్తారు ..
దాంతో మనోజ్ ను పెంచిన తల్లి ఆగ్రావేశురాలవుతుంది. నా బిడ్డ ఎప్పుడూ పోలీస్ స్టేషన్ కి వెళ్లలేదని తను బెంగళూరులో డాక్టర్ గా చాలా మంచి పేరు తెచ్చుకున్నాడని.. వాడిని చూస్తేనే అందరూ చేతులెత్తి దండం పెడతారని అలాంటిది ఈరోజు పోలీస్ స్టేషన్ కి తీసుకు వెళ్లడానికి కారణం ఢిల్లీ అని అలాంటి ఇంట్లో అస్సలు నేను క్షణం కూడా ఉండనని.. మనోజ్ వాళ్ళమ్మ కోపంతో ఊగిపోతూ కళ్ళు తిరిగి పడిపోతుంది.

ఇక రేపటి లో ఢిల్లీ ఇంటికి వెళ్లేసరికి ఇంట్లో వాళ్ళందరూ గుమ్మంలో ఎదురుచూస్తూ ఉంటారు. ఢిల్లీ ఇంట్లోకి కాళ్లు పెట్టడం తనే వాళ్ళ నాన్న నువ్వు ఇంట్లోకి రావడానికి వీల్లేదు ఇంట్లో నుంచి బయటికి పొమ్మని తన బ్యాగ్ తీసి బయట విసిరేస్తాడు. రెండు రోజుల్లో వాళ్ళ అన్నయ్య పెళ్లి పెట్టుకొని ఇప్పుడు బయటకు పొమ్మంటే ఎలా పోతాడు అంటూ ఢిల్లీని ఆపడానికి ప్రయత్నిస్తారు.. అసలు ఢిల్లీ ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి కారణం ఏంటో అనేది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం.