Avunu Valliddaru Ista Paddaru: పూజ తన గదిలోకి మనోజ్ రావాలని దయ్యం మాట్లాడినట్టు ఫోన్లో పెద్దపెద్దరుస్తూ ఉంటుంది. ఇక జైరాం తలుపు తీయకపోవడంతో.. చేసేది ఏమీ లేక మనోజ్ పూజ గదిలోకి వెళ్తాడు.. ఆపాటికి పూజ నిద్రపోతున్నట్లు మంచం మీద పడుకునే యాక్షన్ చేస్తూ ఉంటుంది.. పూజకు అనుమానం రాకుండా ఉండేందుకు మనోజ్ కాస్త జాగ్రత్త పడి తనని మంచం మీద లెగవమని అంటాడు..

నా చేతులు బాగోలేదు కింద చాప బొంత వేసుకోలేను అని పూజ అంటుంది. ఇక మనోజే పూజకు చాప బొంత వేసి నిద్రపోమని చెబుతాడు. లైట్ కూడా ఆఫ్ చేయమని చెబుతుంది. నాకు లైట్ ఆఫ్ చేస్తే నిద్ర పట్టదు అని మనోజ్ అంటాడు. అయితే నీ కళ్ళకు గంతలు కట్టుకొని అని అంటాడు. నా చేతిలో బాగోలేవు కదా నువ్వే కట్టు అని పూజ అంటుంది ఇక నోట్లో నోట్లో కొనుక్కుంటూ పూజకి కలగంతలు కడతాడు మనోజ్.
మనోజ్ తన కుటుంబ సభ్యులందరికీ కలిసి తన కొత్త హాస్పిటల్ ఓ ప్రారంభోత్సవానికి వెళ్తారు. ఆ పార్టీకే అక్కడికి హాస్పిటల్స్ స్టాఫ్ అంతా చేరుకొని మనోజ్ కి ఘనంగా స్వాగతం పలుకుతారు. ఇక మనోజ్ తో పాటు తన పూర్వ తన భార్య పూజకు కూడా మంచి క్రెడిట్ లభిస్తుంది. మనోజ్ పూజ ఇద్దరూ పక్క పక్కన నుంచోమని ఫొటోస్ తీయడంతో సరే అని అంటారు. మనోజ్ అక్క కూడా తన బావని వెంటపెట్టుకొని అక్కడికి వస్తుంది.
మిమ్మల్ని పిలవలేదు కదా ఎందుకు వచ్చారు అని దేనికి అనగానే.. మేమేమీ మీ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి రాలేదు. మా ఆయనకి దగ్గు గా ఉంటే ఇక్కడికి వచ్చాము అని అంటుంది అందరూ హాస్పటల్ ప్రారంభోత్సవంలో నిమగ్నమై ఉండగా.. ఆ కాసేపటికి దయానంద్ సునంద తో పాటు తన అత్తగారిని మిగతా కుటుంబ సభ్యుల్ని వెంటపెట్టుకొని అక్కడికి వస్తారు. అవ్వకి ఆరోగ్యం బాగోలేదని కడుపునొప్పి డ్రామా అడ్డం పెట్టుకొని వాళ్లు అక్కడికి చేరుకుంటారు. దాంతో దేవకి దెప్పిపొడుపుగా సునందని అరుస్తుంది. అయినా నా కొడుకు హాస్పటల్ ప్రారంభోత్సవానికి నన్ను పిలిచేదేంటి ఊరంతా తెలిసారు. అయినా మీరు పంచిన పాంప్లెట్లో ఊరందరినీ రమ్మని రాసి ఉంది కదా అందుకే వచ్చామని దయానంద్ కూడా కవర్ చేస్తాడు..
ఇక రేపటి ఎపిసోడ్లో అందరూ నిన్ను ఎందుకు పట్టించుకోవాలి? నువ్వు ఏం పని చేస్తున్నావని అత్తయ్య మామయ్యలు నీ గురించి అందరికీ గౌరవంగా ఏమని చెప్పుకోవాలి అని ఢిల్లీకి కళావతి క్లాస్ పీకుతుంది దాంతో ఢిల్లీలో మార్పు వస్తుందో రాదో చూడాలి..