Avunu Valliddaru Ista Paddaru: ప్రమీల భర్త ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతారు. మీరు అసలు ఎందుకు రాలేదు అని అడుగుతుంది. అతని వెనకమాల తన మొదటి భార్య ఉండి ఆ మాటలను వింటుంది.. ఆమె ఎవరో కాదు కళావతి తల్లి.. అది గమనించిన ఆయన నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాను అర్థం చేసుకో అని అంటాడు.. అయినా కానీ ప్రమీల కోపంతో ఊగిపోతూ తన వద్దని నోటికొచ్చినట్లు మాటలు అంటుంది.. ఇక్కడ నా కూతురు పెళ్లి పట్టించుకోవు కానీ.. అక్కడ నీ కూతురు పెళ్లి మాత్రం చేసుకుంటావా అని ప్రమీల అంటుంది.. దాంతో కోపం వచ్చినా ఆమె భర్త ఏం చేసుకుంటావో చేసుకోపో అని కాల్ కట్ చేస్తాడు.

రేయ్ రెడ్డప్ప.. మీ బావ ఈ కూతురు పెళ్లి కంటే కూడా.. ఆ కూతురు పెళ్లి ముఖ్యం అన్నట్టు మాట్లాడుతున్నాడు రా.. వాళ్లకి నీ విలువ అంటే ఏంటో తెలుసు రావాలి అక్క అవున్రా నిజంగానే వాళ్లకి మన విలువ తెలిసి మన కాడికి వచ్చేలాగా చేయాలి అని ప్రమీల అంటుంది. అయితే ఏం చేయమంటావో చెప్పు అక్క అని రెడ్డప్ప అంటాడు. ఈ పెళ్లి ఆగిపోవాలి అని ప్రమీల అంటుంది. సరే అక్క నువ్వు ఎట్టా చెప్తే అట్టనే చేస్తా అని రెడ్డప్ప అంటాడు..

ఢిల్లీ కి మనోజ్ ఫోన్ చేసి ఈ ఇంట్లో నువ్వు లేకుండా పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అన్న.. నువ్వు నాన్న కాడికి వచ్చి ఇంకోసారి ఇలాంటి తప్పు చేయను అని చెప్పి మాట్లాడమని మనోజ్ చెబుతాడు.. కానీ నేను నీతో ముందుగా ఒక విషయం చెప్పాలి తోటలోకి రమ్మని ఢిల్లీ పిలుస్తాడు. సరే అని మనోజ్ అక్కడికి వస్తాడు. మనోజ్ అక్కడికే రావడంతోనే కొంతమంది మనుషులు వచ్చి మనోజ్ ను కిడ్నాప్ చేస్తారు.. మచ్చా మీ తమ్ముడిని ఎవరో కిడ్నాప్ చేస్తున్నారు అని ఢిల్లీ పక్క ఉన్నవాళ్లు అంటారు.

ఇక వెంటనే ఢిల్లీ వాళ్లందర్నీ కొట్టి మనోజ్ నీకు ఆపాడ్డానికి ప్రయత్నిస్తాడు. కానీ వాళ్ళు ఢిల్లీని అడ్డుకొని మనోజ్ను తీసుకెళ్లి పోతారు. వాళ్ళల్లో ఒకడు చిక్కగా అసలు మనోజ్ని యాడికి తీసుకెళ్ళి పోతున్నారు ..ఏం చేస్తున్నారు చెప్పమని చంపడానికి కూడా ఢిల్లీ వెనుకాడకుండా బెదిరిస్తాడు.. దాంతో భయమేసినా అతను మేము వచ్చింది నిన్ను తీసుకుపోవడానికి కాదు.. అతని తీసుకుపోవడానికి వచ్చాం అతనికి పెళ్లి కుదిరింది అంట కదా.. ఆ పెళ్లి ఆగిపోవడం కోసం ఇదంతా చేస్తున్నాము. ఈ పెళ్లి ఆగిపోతే చాలు అని అతను చెబుతాడు అసలు మీ వెనకాల ఎవరున్నారో మా అన్నని అడిగి తీసుకెళ్తున్నారు చెప్పండి అంటూ ఢిల్లీ అనగానే.. అతను ఢిల్లీ కళ్ళల్లో మట్టి కొట్టి అక్కడ నుంచి పారిపోతాడు.. ఢిల్లీ ఇక పరిగెత్తుకుంటూ పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ కూడా ఇస్తాడు.

ఇక రేపటి ఎపిసోడ్ లో మనోజ్ గెటప్ లో ఢిల్లీ ఇంట్లోకి వస్తాడు. పెళ్ళికొడుకు లాగా ముస్తాబయి కనిపిస్తాడు. మనోజ్ ను పెంచుకున్న తండ్రి రేయ్ ఢిల్లీ అని మనోజ్ గెటప్ లో కూర్చున్న ఢిల్లీని పిలుస్తాడు. నేను మనోజ్ ని ఢిల్లీని కాదు అని మనోజ్ గెటప్ లో ఉన్న ఢిల్లీ వాదించడానికి ప్రయత్నిస్తాడు.. నువ్వు మనోజ్ గెటప్ లో వస్తే నువ్వు ఢిల్లీలో మనోజ్ వో కాదో గుర్తుపట్టలేని పరిస్థితిలో నేనున్నాననుకుంటున్నావా? నువ్వు కచ్చితంగా ఢిల్లీ పోరా బయటికి నన్ను విసిగించకు అని ఆయన అరుస్తాడు.. మనోజ్ ఎక్కడ ఉన్నాడో చెప్పు అని పెద్దగా అరుస్తాడు.