Avunu Valliddaru Istha Paddaru: ఢిల్లీ నిద్రలో నుంచి లేచేసరికి తన అత్త నాగరత్నం ఎదురుగా కనిపిస్తుంది.. ఏందత్తా ఇంత పొద్దున్నే వచ్చావు ఏంది కతా అని ఢిల్లీ అడుగుతాడు . అల్లుడు మీద ప్రేమతో పలకరిద్దామని వస్తే అట్ట మాట్లాడుతావ్ ఏంది అని అడుగుతుంది. అయినా నీకు ఈ అత్తంటే ఈమధ్య పరాశకాలు ఎక్కువయ్యాయి.. ప్రేమ కనిపించడం లేదు అని అనగానే.. అయితే నువ్వు ఎప్పుడు వెళ్ళిపోతావో చెప్పు అంతా ఆరోజు నేను ఆనందంగా ఉంటాను అంటూ… ఢిల్లీ అక్కడ నుంచి అదృశ్యం అవుతాడు.

ఢిల్లీ తన ఫోన్ చార్జింగ్ లో పెట్టి స్నానం చేయడానికి వెళ్తాడు.. మనోజ్లా కళావతి తో మాట్లాడుతుంది. ఢిల్లీ అని తెలియక తన ఫోన్ కి వీడియో కాల్ చేస్తుంది. కళావతి అంతలోకి ఢిల్లీ వాళ్ల బామ్మ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది అని అడుగుతుంది. ఆయనతో మాట్లాడదామని ఫోన్ చేశానని కళావతి అంటుంది. మీ బావతో ఏం మాట్లాడాలి అని వాళ్ళ బామ్మ అంటుంది. అయినా కానీ కళావతి బుర్రకు తట్టనే తట్టదు అది మనోజ్ ఫోన్ అని కాదని.. ఇక నేరుగా వాళ్ళ బామ్మ కళావతి ఫోన్ చేసిందని ఢిల్లీ కి వీడియో కాల్ చూపిస్తుంది .
ఈ ఫోన్ నాది కాదు మనోజ్ ది వెళ్లి మనోజ్ కి ఇవ్వమని ఢిల్లీ చెబుతాడు అయ్యో నేనే పొరపాటు పడ్డాను అని అంటుంది బామ్మ గారు మీరే ఈ ఫోను మనోజ్ కి ఇవ్వండి అంటూ కళావతి రిక్వెస్ట్ చేస్తుంది.

వాళ్ల బామ్మ ఇల్లంతా తిరిగి మనోజ్ దగ్గరికి వెళ్లే లోపు ఢిల్లీ ఇంట్లో నుంచి దొంగ దారిలో తిరిగి వచ్చి మనోజ్ గెటప్ లో కనిపిస్తాడు. ఇక అతను నిజంగా మనోజ్ అనుకొని ఢిల్లీకే ఫోన్ ఇస్తుంది. వాళ్ళ బామ్మ ఇక ఢిల్లీ మనోజ్ లాగా మేనేజ్ చేస్తూ వీడియో కాల్ లో మాట్లాడుతారు. అయితే నాకు ఫ్యాక్టరీ వర్క్స్ ఉన్నాయని మళ్లీ మీకు ఫోన్ చేస్తాను. అప్పుడు రెడీగా ఉండండి కలుద్దామని కళావతి చెబుతుంది.
ఇక రేపటి ఎపిసోడ్ లో కళావతి ఫోన్ చేసి ఒక ప్లేస్ కి రమ్మని చెబుతుంది మనోజ్ గెటప్ లో ఢిల్లీ అక్కడికి వస్తాడు అంతలో ఢిల్లీ మచ్చ అంటూ చిట్టి పిలుస్తుంది ఏంది ఢిల్లీ మచ్చా ఎవరు ఈ పాప అని అడగగానే కళావతి అని చెబుతాడు. ఏంది కళావతి నన్ను కాదు అనుకుని ఈ అమ్మాయిని మాట్లాడుతున్నావా.. ఇది అన్యాయం మచ్చా అంటూ కళావతి ముందే.. ఢిల్లీ మనోజ్ దగ్గర కళావతి లాగా మ్యానే జ్ చేస్తున్న సంగతి తెలిసిపోతుంది. ఇక ఏం జరుగుతుందో తరువాకంలో చూద్దాం.