మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం `బబ్లీ బౌన్సర్`. మధుర్ భండార్కర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి స్టార్ స్టూడియోస్ మరియు జంగ్లీ పిక్చర్స్ వారు నిర్మాణం వహించారు. కేవలం నాలుగు నెలల్లోనే షూటింగ్‌ను కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం.. సెప్టెంబర్ 23న ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వేదికగా హిందీతో పాటు తెలుగు, తమిళంలోనూ విడుదల కాబోతోంది.
ఈ నేపథ్యంలోనే జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్న మేకర్స్.. తాజాగా ట్రైలర్ ను బయటకు వదిలారు. `ఫతేపూర్ బేబి. ఈ ఊరు బౌన్సర్ కి కేరాఫ్ ఆడ్రస్. ఏ పిల్లోడైనా పెద్దాయ్యాక సెటిల్ అవ్వాలంటే బాడీ పెంచాల్సిందే. అదీ ఒక పహిల్వాన్ లాంటి బాడీ. ఈ కథ కూడా అలాంటిందే. కానీ పహిల్వాన్ అబ్బాయి కాదు.. చాకు లాంటి అమ్మాయి` అంటూ బ్యాక్ గ్రైండ్ వాయిస్ తో ప్రారంభమైన ట్రైలర్.. ఆధ్యంతం నవ్వులు పూయిస్తూ ఆకట్టుకుంది.

బౌన్సర్ల ఊరిగా పేరున్న ఫతేపూర్ బేరీ అనే గ్రామంలో పుట్టి.. అక్కడి ప్రతి మగపిల్లవాడిలాగే బబ్లీ అనే అమ్మాయి కూడా ఫిజిక్ డెవలప్ చేసుకొని పెహల్వాన్‌లా మారుతుంది. ఆ తర్వాత ఆమె ఢిల్లీలో లేడీ బౌన్సర్ గా ఉద్యోగం సంపాదిస్తుంది. అక్కడ ఆమెకి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి..? వాటికి బబ్టీ ఎలా ఎదుర్కోబోతోంది..? అన్నదే సినిమాగా ట్రైలర్ బట్టీ అర్థం అవుతోంది.
ఇందులో తమన్నా బబ్లీ పాత్రలో అలరించబోతోంది. ఓ మెడికల్ షాప్ కి వెళ్లి `అన్నా రెండు కండోమ్ ప్యాకెట్లు ఇవ్వు` అని బెరుకు లేకుండా అడిగేంత దమ్మున్న పాత్ర ఆమెదని ట్రైలర్ ద్వారా తేలిపోయింది. తమన్నా నటన, డైలాగ్ డెలివరీ అదిరిపోయాయి. ఆమె పాత్రకు కాస్త కామెడీ టచ్ ఇచ్చి డైరెక్టర్ మలిచిన తీరు కూడా ఆకట్టుకుంటోంది. మొత్తానికి ట్రైలర్ తోనే అంచనాలను పెంచేసిన తమన్నా.. `బబ్లీ బౌన్సర్`తో సూపర్ హిట్ కొట్టేలానే కనిపిస్తోంది.