Entertainment News సినిమా

కృతి శెట్టి ఖాతాలో చెత్త రికార్డ్‌.. బేబ‌మ్మ టైమ్ అస్స‌ల బాలేదు!

Share

యంగ్ సెన్సేషన్ కృతి శెట్టి అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. సుకుమార్ ప్రియ శిష్యుడు బుచ్చిబాబు తెరకెక్కించిన `ఉప్పెన` మూవీ తో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిందీ బ్యూటీ. ఇందులో బేబమ్మ గా తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసి తొలి మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఆ తర్వాత కృతి శెట్టి నటించిన `శ్యామ్ సింగ‌రాయ్‌`, `బంగార్రాజు` చిత్రాలు సైతం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించాయి.

కెరీర్ స్టార్టింగ్ లోనే హ్యాట్రిక్ హిట్స్ ఖాతాలో వేసుకున్న కృతి శెట్టికి లక్కీ హీరోయిన్ అనే ట్యాగ్ ఇచ్చేసి ఆమెను ఆకాశానికి ఎత్తేశారు. కానీ ప్రస్తుతం ఆమె టైమ్‌ అస్సలు బాలేద‌నే చెప్పాలి. గత కొద్ది రోజుల నుంచి కృతి శెట్టి నటించిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతోంది. రీసెంట్ గా కృతి శెట్టి `ది వారియర్`, `మాచర్ల నియోజకవర్గం`, `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` చిత్రాలతో ప్రేక్షకులను పలకరించింది.

krithi shetty
krithi shetty

అనూహ్యంగా ఈ మూడు చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయ్యాయి. దీంతో హ్యాట్రిక్ హిట్స్ తర్వాత హ్యాట్రిక్ ఫ్లాప్స్ మూటగట్టుకున్న హీరోయిన్ గా కృతి శెట్టి ఓ చెత్త రికార్డును ఖాతాలో వేసుకుంది. వరస ఫ్లాపుల నేపథ్యంలో కృతి శెట్టి కెరీర్‌ ఇప్పుడు ప్రమాదంలో పడింది. మరి ఇప్పటి నుంచైనా కథల ఎంపికలో జాగ్రత్త వహించి కెరీర్‌ను ముందుకు సాగిస్తుందేమో చూడాలి.

కాగా, కృతి శెట్టి సినిమాల విష‌యానికి వ‌స్తే.. తెలుగుతో నాగ‌చైత‌న్య‌కు జోడీగా ఓ సినిమా చేస్తోంది. వెంకట్ ప్రభు దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళంలోనూ విడుద‌ల కానుంది. అలాగే కృతి శెట్టి త‌మిళంలో డైరెక్ట‌ర్‌గా సూర్య స‌ర‌స‌న `అచ‌లుడు` అనే చిత్రంలోనూ న‌టిస్తోంది.


Share

Related posts

Rashmika: ర‌ష్మిక‌ను ఇంత హాట్‌గా ఎప్పుడైనా చూశారా.. అస్స‌లు త‌ట్టుకోలేరు!

kavya N

షాలిని..ఇదేం ప‌ని

Siva Prasad

బిగ్ బాస్ 4 : గ్రాండ్ ఫినాలే రోజు బిగ్ బాస్ కంటెస్తెంట్స్ జీ తెలుగు ఛానెల్ లో ఏం చేస్తున్నారు…?

arun kanna