Hit 2: అడవి శేష్ హీరోగా వచ్చిన “హిట్ 2” సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడం తెలిసిందే. శైలేష్ కొలను దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని నిర్మాతగా వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడం జరిగింది. మొదటి రోజే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా చాలామంది సినీ ప్రముఖులను ఆకట్టుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా సినిమా చూసి అభినందించినట్లు ఈ చిత్రం సక్సెస్ మీట్ లో అడవి శేష్ తెలియజేయడం జరిగింది.
ఇదిలా ఉంటే తాజాగా బాలకృష్ణ ఈ సినిమాని చూసి చిత్ర బృందాన్ని అభినందించారు. కొడుకు మోక్షాజ్ఞతో పాటు ప్రత్యేకంగా ఈ సినిమాని చూసి… హీరో అడవి శేష్ నీ అభినందించడం జరిగింది. దర్శకుడుని మరియు నిర్మాత నాని కూడా బాలకృష్ణ అభినందించారు. కుమారుడు మోక్షజ్ఞతోపాటు పెద్ద అల్లుడు భరత్ కూడా సినిమా చూడటం జరిగింది. ఈ సందర్భంగా బాలకృష్ణ అడివి శేష్ నీ అభినందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదే సమయంలో తన సినిమాని బాలకృష్ణ చూడటం పట్ల… సోషల్ మీడియాలో తన ఆనందాన్ని ఫోటోలు మరియు మాటల రూపంలో అడవి శేష్ తెలియజేశారు. “బాలకృష్ణ గారికి హిట్ 2 చాలా బాగా నచ్చింది.
దర్శకుడు శైలేష్ కొలను పనితనాన్ని మరియు తన నటనను బాలకృష్ణ ఎంతగానో మెచ్చుకున్నారని పేర్కొన్నాడు. ఇదే సమయంలో హిట్ సిరీస్ లో నెక్స్ట్ నాని ఆధ్వర్యంలో వచ్చే సినిమాలో గెస్ట్ అపీరియన్స్ ఇవ్వాలని బాలయ్యను సరదాగా అడిగినట్లు.. శేషు సోషల్ మీడియాలో తెలియజేశారు. ఇక ఇదే సమయంలో కుర్ర హీరో సుధీర్ బాబు కూడా..”హిట్ 2″ చాలా బాగుందని మంచి విజయాన్ని అందుకున్నందుకు చిత్ర బృందానికి అభినందనలు అని తెలియజేశారు. ఈ క్రమంలో సుధీర్ బాబుకి అడవి శేష్ ధన్యవాదాలు తెలిపారు. నాని నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ ప్రొడక్షన్స్ లో వచ్చిన తొలి చిత్రం… భారీ వసూలు రాబట్టడం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.