20.7 C
Hyderabad
December 6, 2022
NewsOrbit
Entertainment News సినిమా

కెరీర్‌లో తొలిసారి యాడ్స్ కు బాల‌య్య గ్రీన్ సిగ్న‌ల్‌.. ఇక ద‌బిడి దిబిడే!

Share

సాధారణంగా సెలబ్రిటీలు ‌ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు పలు ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. అలాగే ఆయా సమస్థల యాడ్స్ లో న‌టిస్తు కోట్లు వెనకేసుకుంటున్నారు. ఈ లిస్ట్‌లో అల్లు అర్జున్‌, మ‌హేష్ బాబు, రామ్ చ‌రణ్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ ముందు వ‌ర‌స‌లో ఉన్నారు.

అయితే ఇప్పుడు ఈ లిస్టులో నరసింహం నందమూరి బాలకృష్ణ కూడా చేర‌బోతున్నారు. కెరీర్‌ లోనే తొలిసారి ఓ కమర్షియల్ యాడ్‌లో నటించేందుకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. శ్రేయస్ మీడియా ఆధ్వర్యంలో సాయిప్రియ కన్స్ట్రక్షన్స్ గ్రూప్ కోసం తెరకెక్కించబోయే ఓ యాడ్‌లో బాలయ్య నటించిన క‌నిపించ‌బోతున్నారు.

balakrishna
balakrishna

ఈ విషయాన్ని శ్రేయస్ మీడియా అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. అలాగే బాలయ్యకు కృతజ్ఞతలు కూడా తెలిపింది. మొత్తానికి ఓవైపు హీరోగా.. మరోవైపు హోస్ట్‌గా దూరుకుపోతూ ప్రేక్షకులను అలరిస్తున్న బాలయ్య.. ఇప్పుడు యాడ్స్ లో నటించేందుకు కూడా ఓకే చెప్పడంతో నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. అంతేకాదు `బాల‌య్య మజాకా.. ఇక ద‌బిడి దిబిడే` అంటూ కామెంట్లు చేస్తున్నారు.

కాగా, సినిమాల విష‌యానికి వ‌స్తే.. బాల‌య్య ప్ర‌స్తుతం గోపీచంద్ మ‌లినేనితో త‌న 107వ చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ చిత్రానికి `వీర‌సింహారెడ్డి` టైటిల్‌ను ఖ‌రారు చేశారు. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానుంది.

https://twitter.com/shreyasgroup/status/1583743528102170626?s=20&t=SwJR3VU_UbD8yWJ-U9tlbg


Share

Related posts

Radhe shyam: కొత్త కంటెంట్‌తో విజువల్ సర్ప్రైజ్ మొదలు

GRK

థియేటర్లు పెరుగుతున్నాయి

Siva Prasad

BREAKING: హీరో గా సిద్ శ్రీరామ్ ! చాలా పెద్ద డైరెక్టర్ తో సినిమా సంతకం పెట్టాడు !

somaraju sharma