NewsOrbit
Entertainment News సినిమా

రీషూట్ మోడ్ లో బాల‌య్య `ఎన్‌బీకే 107`.. టార్గెట్ లాక్‌?!

Share

నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మలినేనితో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్యకు ఇది 107వ ప్రాజెక్టు కావడంతో.. `ఎన్‌బీకే 107` వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది.

కన్నడ నటుడు దునియా విజ‌య్ విల‌న్‌గా చేస్తుంటే.. వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర, ముర‌ళీ శర్మ తదితరులు కీలకపాత్రల్లో క‌నిపించ‌బోతున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే సంక్రాంతి కానుక‌గా విడుదల కానుంద‌నే టాక్ ఉంది.

nbk 107 movie update
nbk 107 movie update

ఇకపోతే రీసెంట్గా టర్కీలో 40 రోజుల పాటు షూటింగ్ నిర్వహించిన విషయం విధితమే. సినిమాలోని పలు కీలక సన్నివేశాలతో పాటు ఒకటి రెండు సాంగ్స్ ను అక్కడ చిత్రీకరించి కొద్ది రోజుల క్రితమే ఇండియాకు తిరిగి వచ్చింది చిత్ర టీమ్‌. అయితే ఈ షెడ్యూల్ కి ముందు హైదరాబాద్లో చిత్రీకరించిన కొన్ని సన్నివేశాల ప‌ట్ల గోపీచంద్ అసంతృప్తిగా ఉన్నార‌ట‌.

ఈ నేప‌థ్యంలోనే రీ షూట్ చేసేందుకు ప్లాన్ చేయగా.. అందుకు బాలయ్య కూడా అంగీకరించారట. ప్రస్తుతం `ఎన్‌బీకే 107` టీమ్‌ రీ షూట్ మోడల్ లో ఉందని తెలుస్తోంది. ఇక అక్టోబర్ చివరి నాటికి షూటింగ్ మొత్తాన్ని కంప్లీట్ చేసేయాలని గోపీచంద్ టార్గెట్ ను కూడా పెట్టుకున్నారట. అనంతరం పోస్ట్ ప్రొడక్షన్ ప‌నుల‌ను త్వ‌ర‌త్వ‌ర‌గా కంప్లీట్ చేసి.. ప్రచార కార్యక్రమాలను షురూ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.


Share

Related posts

దేశంలో తొలి కంప్యూటర్ గ్రాఫిక్స్ మూవీ.. ‘అమ్మోరు’కి 25 ఏళ్లు..

Muraliak

బోయపాటిని మించిపోయిన బాలీవుడ్..! యాక్షన్ లో ‘అతి’తో ట్రోలింగ్స్

Muraliak

పాన్ ఇండియా రేంజ్ లో అడవి శేష్ సినిమా..??

sekhar