NewOrbit
Entertainment News సినిమా

ఫ‌స్ట్ యాడ్‌కి బాల‌య్య రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలిస్తే నోరెళ్ల‌బెడ‌తారు!

Share

ఆరు ప‌దుల వయసులో ఓవైపు హీరోగా, మరోవైపు హోస్ట్ గా ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేస్తున్న నట‌సింహ నందమూరి బాలకృష్ణ.. ఇటీవల కమర్షియల్ యాడ్స్ లో నటించేందుకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇన్నేళ్ల కెరీర్లో బాలయ్య ఏ ఒక్క బ్రాండ్ కి కూడా ప్రచారకర్తగా వ్యవహరించింది లేదు.

కానీ, కెరీర్‌లోనే తొలిసారి సాయి ప్రియా గ్రూప్ వెంచర్ అయిన రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్- 116 పారామౌంట్ కు బాలయ్య బ్రాండ్ అంబాసిడర్ గా మారారు. సాయి ప్రియా గ్రూప్ అనేది సౌత్ ఇండియాలోని కన్స్ట్రక్షన్ ప్లాటింగ్ సేవల సంస్థ. ఈ సంస్థ‌ను ప్ర‌మోట్ చేస్తూ బాల‌య్య రెండు యాడ్స్ చేశాడు.

Advertisements
balakrishna
balakrishna

ఈ రెండు యాడ్స్‌ ఇప్ప‌టికే బ‌య‌ట‌కు వ‌చ్చి.. మంచి రెస్పాన్స్‌ను ద‌క్కించుకున్నాయి. ఈ యాడ్స్‌లో బాల‌య్య లుక్స్ ప‌రంగానే కాదు అదిరిపోయే డైలాగ్స్‌తో అద‌ర‌గొట్టేశారు. అయితే ఈ యాడ్స్ కోసం బాల‌య్య అందుకున్న రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలిస్తే నోరెళ్ల‌బెతారు.

ఇంత‌కీ ఎంతో తెలుసా..? అక్షరాలా రూ.15 కోట్లు. త‌న ఫస్ట్ యాడ్స్‌ ద్వారా బాలయ్య రూ. 15 కోట్లు అందుకున్నాడ‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అంతేకాదు, బాల‌య్య ఈ భారీ మొత్తాన్ని బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ ఇనిస్టిట్యూట్‌ అండ్ హాస్పిటల్‌కు డోనేట్ చేశార‌ట‌. దీంతో బాలయ్య గొప్ప మనసుకు నందమూరి అభిమానులే కాకుండా నెటిజ‌న్లు సైతం ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.


Share

Related posts

డ‌బ్బింగ్ చెబుతోన్న `మ‌న్మ‌థుడు 2`

Siva Prasad

Nikhil Siddhartha: నిఖిల్ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. కార్తికేయ-3పై క్రేజీ అప్‌డేట్..

Ram

Deva katta : దేవా కట్టాతో సాయి ధరమ్ తేజ్ ప్రయోగం ..బెడిసి కొడుతుందా..?

GRK