నటసింహం నందమూరి బాలకృష్ణ ఓవైపు హీరోగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తూనే.. మరోవైపు ప్రముఖ తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ `ఆహా` వేదికగా `అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే` అనే టాక్ షోకు హూస్ట్ గా చేస్తూ ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే.
ఇటీవలె `అన్ స్టాపబుల్` సీజన్ 2 ప్రారంభమైంది. ఫస్ట్ ఎపిసోడ్ కూడా స్ట్రీమింగ్ అయ్యి.. విశేష ఆదరణను అందుకుంది. తొలి ఎపిసోడ్‌కు నారా చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ గెస్ట్లుగా విచ్చేశారు. ప్రస్తుతం రెండో ఎపిసోడ్ కోసం ఫాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే రెండో ఎపిసోడ్ కు యంగ్ హీరోలు సిద్దూ జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ గెస్ట్‌లు వచ్చారు.
ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో ఆహా టీమ్ బయటకు వదిలింది. అయితే ఈ ప్రోమో లో బాలయ్య ఒక సందర్భంలో మాట్లాడుతూ.. రష్మిక మందన్నా తన క్రష్ అంటూ మనసులో ఉన్న మాటను బయట పెట్టేశారు. దీంతో ఆయన కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్ గా మారాయి.
అయితే బాలయ్య కామెంట్స్ పట్ల నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా `రష్మిక మీ క్రష్ అంటే విజయ్ దేవరకొండ ఫీల్ అవుతాడంటూ` కామెంట్లు చేస్తున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. రష్మిక-విజయ్ దేవరకొండ ప్రేమలో ఉన్నారని గత కొద్ది రోజుల నుంచీ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల వీరిద్దరూ వెకేషన్ కోసం మాల్దీవులకు కలిసి వెళ్లడంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది.