`అఖండ` వంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం నటసింహం నందమూరి బాలకృష్ణ గోపీచంద్ మలినేనితో తన తదుపరి చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఇటీవలె `వీర సింహారెడ్డి` అనే టైటిల్ ను కన్ఫార్మ్ చేశారు. ఇందులో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.
అలాగే కన్నడ నటుడు దునియా విజయ్ విలన్‌గా చేస్తుంటే.. విలక్షణ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ బాలయ్య సోదరిగా కీలక పాత్రను పోషిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్.. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది.
ఈ మూవీ షూటింగ్ సైతం తుది దశకు చేరుకుంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ నెట్టింట వైరల్‌గా మారింది. అదేంటంటే.. ఈ సినిమా కోసం బాలయ్య కొన్ని రియల్ స్టంట్స్ చేస్తున్నారట. చాలా మంది హీరోలు ప్రమాదకరమైన స్టంట్స్ కోసం డూప్‌లను వాడుతుంటారు.
కానీ, రిస్క్ అని తెలిసినప్పటికీ బాలయ్య వెనక్కి తగ్గలేదట. ఆయా స్టంట్స్‌ను పూర్తి చేశారట. ఏదేమైనా ఆరు పదుల వయసులో రియల్ స్టంట్స్ చేయడం నిజంగా ఇతర హీరోలకు ఆదర్శప్రాయం అనే చెప్పాలి. మరి ఈ సినిమాతో బాలయ్య మరో హిట్ అందుకుని సక్సెస్ జ్యోష్ను కొనసాగిస్తారా..లేదా.. అన్నది చూడాలి.