Unstoppable 2: “ఆహా” ఓటిటిలో అన్ స్టాపబుల్ టాకీ సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. ఈ షోకి వస్తున్న వ్యూస్ మొదటి సీజన్ లో అనేక రికార్డులు క్రియేట్ చేయడం తెలిసింది. ఓటిటి రంగంలో టాకీ షో లలో గ్లోబల్ వ్యాప్తంగా టాప్ 10వ స్థానంలో స్థానం సంపాదించింది. ఇక దేశంలో అయితే నంబర్ వన్ స్థానంలో “అన్ స్టాపబుల్” షో నిలిచింది. వెండితెరపై నటుడిగా అప్పటివరకు రాణించిన బాలయ్య బాబు ఈ షోలో హోస్ట్ గా కొత్త అవతారం ఎత్తడంతో.. అందరూ ఆసక్తిగా చూడటం జరిగింది.
హోస్ట్ గా బాలకృష్ణ చాలా ఎనర్జిటిక్ గా షోకి వచ్చే అతిధులను నవ్విస్తూ ప్రశ్నలు వేస్తూ చాలా తెలివిగా జవాబులు రాబడుతూ.. షోపై ఇంట్రెస్ట్ కలిగేలా చేశారు. మొదటి సీజన్ లో చాలామంది టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు రావడం జరిగింది. ఇదిలా ఉంటే ఇప్పుడు సెకండ్ సీజన్ ఈనెల అక్టోబర్ 14 వ తారీకు స్టార్ట్ కావడం తెలిసింది. రెండవ సీజన్ కి చాలా వైవిద్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు మరియు ఆయన తనయుడు నారా లోకేష్ వచ్చారు. ఈ ఎపిసోడ్ ఇప్పుడు అనేక రికార్డులు క్రియేట్ చేస్తూ ఉంది. 24 గంటల్లోనే పది లక్షల వ్యూస్ సాధించిన.. చంద్రబాబు అన్ స్టాపబుల్ ఎపిసోడ్ నాలుగు రోజుల్లోనే 100 మిలియన్ మినిట్స్ స్ట్రీమింగ్ అయినట్లు “ఆహా” వెల్లడించింది.
ఇది ఇండియన్ టాకీ షోలలోనే బిగ్గెస్ట్ అని తెలిపింది. అన్ స్టాపబుల్ సెకండ్ సీజన్ మొదటి ఎపిసోడే ఈ రీతిగా రికార్డులు క్రియేట్ చేయటం సంచలనంగా మారింది. మొదటి సీజన్ కంటే రెండో సీజన్ మరింత హైలెట్ అయ్యేలా షోకి వచ్చే వారి విషయంలో ఆహా టీం చాలా శ్రద్ధ తీసుకుంటుంది అంట. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తో కూడా షో ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!