Bandla Ganesh: తెలుగు రాష్ట్రాల్లో బండ్ల గణేష్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఇక పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు అయితే ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పవన్ కల్యాణ్ ను దేవుడితో పోలుస్తూ తన దైవం అంటాడు బండ్ల గణేష్. తన తల్లిదండ్రుల తర్వాత తనకు గురువు పవన్ కల్యాణ్ అని బండ్ల గణేష్ చెబుతూ ఉంటాడు. పవన్ ను తన పొగడ్తలతో ముంచెత్తుతూ ఉంటాడు. వివాదాలతో వార్తల్లో ఉండే బండ్ల గణేష్ చేసే వ్యాఖ్యలు ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారుతూ ఉంటాయి.
తాజాగా మరోసారి బండ్ల గణేష్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఆకాశ్ పూరి-గెహనా సిప్పీ కాంబినేషన్ లో జీవన్ రెడ్డి డైరెక్షన్ లో చోర్ బజార్ అనే సినిమా తెరకెక్కింది. నిన్న రాత్రి ఈ సినిమా ప్రీరిలీజ్ పంక్షన్ జరిగింది. ఈ పంక్షన్ కు నిర్మాత, నటుడు బండ్ల గణేష్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా బండ్ల గణేష్ మాట్లాడుతూ.. తాను ఈ పంక్షన్ కు రావడానికి ముఖ్య కారణం తన వదిన లావణ్య పూరి అని, అమ్మ, అక్క, వదిన ఎలా ఉండలంటే లావణ్య పూరిలా ఉండాలని ప్రశంసలు కురిపించాడు.
సీతాదేవిని తాను చూడలేదు కానీ ఆమెకున్న ఓపిక లావణ్యకు ఉందని, కుంతీదేవికి ఉన్నంత గొప్ప క్వాలిటీస్ ఆమెలో ఉన్నాయని బండ్ల గణేష్ పొగడ్తలు కురిపించాడు. తన తల్లి తర్వాత తాను ఆమెను గౌరవిస్తానని, ఆమె మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అని తెలియజేశాడుప ఎన్నో ర్యాంపులు, వ్యాంపులు వస్తూ పోతుంటాయని, కానీ అమ్మ ఎప్పటికీ ఉంటుందన్నాడు. జీవితాంతం ఆమెను బాగా చూసుకోవాల్సిన బాధ్యత పూరీ జగన్నాథ్, ఆకాశ్, పవిత్రలదేనని చెప్పాడు.
పూరీ ఎంతోమందిని స్టార్స్, సూపర్ స్టార్స్ చేశాడని, కానీ వాళ్ల కొడుకుని మాత్రం స్టార్ ను చేయకుండా ఎక్కడెక్కడో తిరుగుతున్నాడని బండ్ల గణేష్ అన్నాడు. ఎవరినెవరినో స్టార్ట్ చేసి నీ కొడుకు వంతు వచ్చేసరికి ముంబైలో వెళ్లి కూర్చున్నావ్.. ఇదెక్కడి న్యాయమన్నా..నువ్వు చేయకపోయినా నీ కొడుకు స్టార్ అవ్వుతాడు. నువ్వు కూడా నీ కొడుకు డేట్స్ కోసం క్యూలో నిలవడే రోజు వస్తుంది.. గుర్తుపెట్టుకో అంటూ పూరీ జగన్నాథ్ కు తెలిపాడు.ః
అప్పుడు ఆకాశ్ డేట్లు ఇవ్వకుండా తాను చూస్తానంటూ బండ్ల గణేష్ సెటైర్ వేశాడు. ఈ సినిమాలో ఆకాశ్ చింపేశాడని, సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందన్నాడు. మనం సంపాదిస్తే అనుభవించేది కొడకులేనని, మన అప్పులు తీర్చేది కూడా వాళ్లేనన్నాడు.
Acharya: కొరటాల శివ(Koratala Shiva) దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi).. రామ్ చరణ్(Ram Charan) ఫస్ట్ టైం లాంగ్ లెన్త్ రోల్…
Rana: దగ్గుబాటి రానా(Rana) హీరోగా మాత్రమే కాదు అన్ని రకాల పాత్రలు చేస్తూ తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం…
Prabhas: పాన్ ఇండియా స్టార్‌గా సత్తా చాటుతున్న టాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ప్రభాస్ వరుస భారీ చిత్రాలతో ఎంత బిజీగా…
Pawan Kalyan: రాష్ట్రంలో బీజేపీతో జనసేన పొత్తులో ఉంది. జనసేనతోనే మా పొత్తు ఇంక ఏ పార్టీతోనూ మాకు పొత్తు లేదు…
Shriya Saran: అందాల భామ శ్రియ సరన్ గురించి పరిచయాలు అవసరం లేదు. `ఇష్టం` మూవీతో సినీ కెరీర్‌ను…
CM YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రస్తుతం పారిస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. తన కుమార్తె హర్ష…