Bhola Shankar: వాల్తేరు వీరయ్య తర్వాత వచ్చిన మెగాస్టార్ సినిమా భోళాశంకర్. వాల్తేరు వీరయ్య మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమా మీద జనాలు చాలా ఆశలు పెట్టుకోవడం సహజమే కదా. తమిళం వచ్చిన వేదాళం అనే సినిమా ఆధారంగా తీసిన సినిమా ఇది. తమిళం లో ఘానవిజయం సాధించింది సినిమా. మెహ్ర రమేష్ దీనికి దర్శకత్వం వహించారు.

ఇక కదా ఎలావుందో చూద్దాం. శంకర్ తన చెల్లెలు మహా లక్ష్మి తో కల్సి కలకత్తా వెళ్తాడు. ఆమెను కాలేజీ లో జేర్పించి తాను టాక్సీ నడుపుతుంటాడు. ఈ లోపు శ్రీకర్ అనే కుర్రాడు మహా లక్ష్మి తో లవ్ లో పడతాడు. ఇదిలా ఉండగా అక్కడ మానవ అక్రమ రవాణా అవుతూ ఉంటుంది. . కలకత్తాలో అమ్మాయిల కిడ్నాపులు కలకలం సృష్టిస్తాయి. ప్రభుత్వం, పోలీసులు కూడా ఆ మాఫియాను కట్టడి చేయలేకపోతాయి. మాఫియా హెడ్ అలెగ్జాండర్ (తరుణ్ అరోరా)ను ఎవ్వరూ పట్టుకోలేకపోతారు. సిటీలో జరిగే కిడ్నాపుల వెనుక ఉన్న క్రిమినల్స్ గురించి సిటీలోని డ్రైవర్లందరికీ అవగాహన కల్పిస్తారు పోలీసులు. దీంతో ఓ గ్యాంగ్‌లోని వ్యక్తిని చూసి పోలీసులకు సమాచారం అందిస్తాడు శంకర్. మహాలక్ష్మికి శ్రీకర్కి పెళ్లి చేయాలనుకుంటాడు శంకర్. అలెగ్జాండర్ తమ్ముళ్ళని ఒక్కక్కరినీ అంతం చేస్తుంటాడు శంకర్. శ్రీకర్ సోదరి లాస్య( తమన్నా) ఒక క్రిమినల్ లాయర్ఈ విషయాలు గమనిస్తుంది. తర్వాత ఏమి జరిగింది అనేది అసలు కధ . ఆ తరువాత శంకర్‌కు ఎదురైన పరిస్థితులు ఏంటి? అసలు శంకర్ ఎవరు? మానవ అక్రమ రవాణా గ్రూప్ కి శంకర్ కి ఉన్న గొడవ ఏమిటి? శ్రీకర్ పెళ్లి లాస్యతో అయ్యిందా అనేవి ప్రశ్నలు.

ఎనిమిది సంవత్సరాల క్రితం తమిళంలో వచ్చిన ఒక తమిళ సినిమా వేదాళం . అసలు రీమేక్ అంటే కదా అందరికీ తెలిసి పోయి ఉంటుంది. అలాంటిది దానికి క్రియేటివ్ గా ఏమి మార్పులు చేయకుండా కేవలం చిరు గ్లామర్ ఆయన ఫేమ్ ని వాడేసుకుందామని తీసిన సినిమా ఇది.భోళా శంకర్ సినిమాలో కావాల్సినంత మంది కమెడియన్లు, ఆర్టిస్టులున్నారు.. అయితే ఏ ఒక్కరినీ కూడా పూర్తిగా వినియోగించుకోలేదని పిస్తుంది. మధ్య మధ్యలో మెహర్ రమేష్ జొప్పించిన కామెడీని చూస్తే జనాలు చిరాకుపడి పోతారు. కొన్ని సందర్భాల్లో వంశీ (వెన్నెల కిషోర్) పాత్ర తన భార్య ఫోన్ చేస్తుందంటూ.. చిరాకు పడే సన్నివేశాల మాదిరిగానే జనాలు కూడా హాల్ లో అలానే చిరాకు పడే విధంగా దృశ్యాలను మలిచాడు. ఏ కామెడీ కూడా సరిగ్గా పండక విసుగు వస్తుంది. ఇంటర్వెల్ ముందు అయితే జనాలు సహన పరీక్షలానే ఉంది.

ప్రథమార్దంలో ఏ ఒక్క చోట కూడా రమేష్ ప్రతిభ నవ్వించలేకపోతుంది. హాస్యం పేరుతొ తమన్నా, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్‌తో చేయించిన కామెడీ కాస్తా వెకిలి కామెడీగా మారిపోయింది. అందరిదీ అతి అన్నట్టుగానే అనిపిస్తుంది. ఇక చిరంజీవి లాంటి వ్యక్తి చేత చేయించిన కామెడీని కొన్ని చోట్ల ప్రేక్షకులు భరించలేరు. అలా చేయించాడు మెహర్ రమేష్. ఆ తప్పు కచ్చితంగా మెహర్ రమేష్‌దే అవుతుంది. రీమేక్ అని తెలిసినా, ఏ ఒక్క సీన్ కూడా కొత్తగా తీయలేకపోయాడు. కావాల్సినంత కామెడీకి స్కోప్ ఉన్నా నవ్వు పుట్టించేలా చేయలేకపోయాడు. ఇది కచ్చితంగా మెహర్ రమేష్ చేసిన తప్పే అవుతుంది. చిరంజీవి చేత చెప్పించిన డైలాగులు, చేయించిన యాక్టింగ్, ఆ తెలంగాణ యాస సాధారణ ప్రేక్షకులకు అంత రుచించకపోవచ్చు. ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్‌లా చిరు నటించడం కూడా అంతగా సెట్ అవ్వదు. ఇక ఖుషీ సీన్ రీ క్రియేట్ చేయాలనుకోవడం కూడా మెహర్ రమేష్ పొరబాటే అవుతుంది.

ఇక శ్రీముఖితో చేయించింది కామెడీ అనుకుంటే అంత కంటే ఘోరం ఇంకేమీ ఉండదు. సత్య, బిత్తిరి సత్తి, లోబో, వేణు, తాగుబోతు రమేష్, ఆది, వైవా హర్ష ఇలా స్క్రీన్ మీద ఎంత మంది కనిపించినా, పంచ్ వేసినా నవ్వురాదు. ఎవ్వరినీ కూడా సరిగ్గా వాడుకోలేకపోయారు.అసలు మెహర్ రమేష్ కి చిరంజీవి సినిమా ఛాన్స్ ఎందుకిచ్చారో తెలీదు. బలహీనమైన కధనం. బలహీనమైన కామెడీ. చిరంజీవి కామెడీ ని పండించగల దిట్ట . మరి సినీ ఇలా ఉందంటే దర్శకునిదే బాద్యత.
చిరు సినిమా కాబట్టి ఒకసారి చూడచ్చు. ఆయన మీద గౌరవంతో అంతే