Entertainment News సినిమా

ప్ర‌భాస్ `ప్రాజెక్ట్-కె`కు పెద్ద త‌ల‌నొప్పిగా మారిన ఆ యంగ్ హీరో మూవీ?!

Share

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో ఓ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. `ప్రాజెక్ట్ కె` వర్కింగ్ టైటిల్ తో టైమ్ ట్రావెల్ నేప‌థ్యంలో రూపుదిద్దుకుంటున్న చిత్ర‌మిది. ఇందులో బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపిక పదుకొనే హీరోయిన్ గా నటిస్తుంటే.. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, హాట్ బ్యూటీ దిశా పటాని కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

వైజయంతీ మూవీస్ బ్యానర్ పై దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్ తో సి.అశ్వనీదత్ ఈ చిత్రాన్ని పాన్ వ‌ర‌ల్డ్ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు న‌ల‌బై శాతం షూటింగ్ ను కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రాన్ని.. వ‌చ్చే ఏడాది అక్టోబ‌ర్ లో లేదా 2024 సంక్రాంతికి విడుద‌ల చేయాల‌ని స‌న్నాహాలు చేస్తున్నారు.

sharwanand oke oka jeevitham
sharwanand oke oka jeevitham

అయితే అంతా బాగానే జ‌రుగుతున్న త‌రుణంలో `ప్రాజెక్ట్ కె` మేక‌ర్స్ ఓ యంగ్ హీరో మూవీ పెద్ద తలనొప్పిగా మారింద‌ని తాజాగా ఓ టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇంత‌కీ ఆ హీరో మరెవరో కాదు శర్వానంద్. ఈయ‌న‌ రీసెంట్ గా `ఒకే ఒక జీవితం` మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. సెప్టెంబ‌ర్ 9న విడుద‌లై హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది.

అమ్మ కోసం హీరో టైం మెషిన్ ద్వారా కాలంలో వెనక్కి వెళతాడు. అమ్మ సెంటిమెంట్ నేపథ్యంలో టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంది. అయితే `ప్రాజెక్ట్ కె` స్టోరీ లైన్ కూడా దాదాపు ఇలానే ఉంటుందని.. `ఒకే ఒక జీవితం` చూసిన త‌ర్వాత ప్రాజెక్ట్ కె` మేక‌ర్స్‌లో త‌ల‌నొప్పి మొద‌లైంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఈ ప్రచారం ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాల్సి ఉంది. ఒక‌వేళ ఇదే నిజ‌మై రెండు చిత్రాల కథలు దగ్గరగా ఉంటే.. విజువ‌ల్స్ ఎంత అబ్బుర‌ప‌రిచినా ప్రేక్షకులు `ప్రాజెక్ట్ కె` విష‌యంలో ఖ‌చ్చితంగా థ్రిల్‌ను మిస్ అయ్యే అవ‌కాశాలు అంటాయి.


Share

Related posts

చిన్న హీరో అయుండి తమన్నాని అంతమాటన్నాడా ..?

GRK

“లైగర్” రిజల్ట్ పై తమ్మారెడ్డి భరద్వాజ కాంట్రవర్సీ కామెంట్స్..!!

sekhar

Preethi Sharma Beautiful Images

Gallery Desk