సత్యదేవ్ కంచరాన.. ఈ యంగ్ హీరో గురించి పరిచయాలు అవసరం లేదు. తనదైన టాలెంట్‌తో తక్కువ సమయంలో టాలీవుడ్లో విలక్షణ నటుడిగా గుర్తింపు పొందిన సత్యదేవ్ రీసెంట్గా `గాడ్ ఫాదర్` మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. మెగాస్టార్ చిరంజీవి, తమిళ దర్శకుడు మోహన్ రాజా కాంబోలో తెరకెక్కిన పొలిటికల్ డ్రామా ఇది.
కొణిదెల సురేఖ సమర్పణలో సూపర్ గుడ్ ఫిల్మ్స్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఆర్. బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 5న విడుదలైన మంచి విజయం సాధించింది. అయితే ఈ చిత్రంలో చిరంజీవి తర్వాత బాగా హైలెట్ అయిన పాత్ర సత్యదేవ్‌దే. నయనతార భర్త జయదేవ్ దాస్‌గా విలన్ పాత్రలో సత్యదేవ్ ఓదిగి పోయి నటించాడు.
తన పాత్రకు వందకు వంద శాతం న్యాయం చేసి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. ఆయన నటన, డైలాగ్ డెలివిరీ, ఎక్స్ ప్రెషన్స్ ప్రతీది ఆకట్టుకుంది. ఒకానొక దశలో చిరంజీవిని సైతం సత్యదేవ్ డామినేట్ చేసేశాడు. అయితే ఈ సినిమా ఎఫెక్ట్‌తో పాపం సత్యదేవ్‌కు అన్నీ ఇప్పుడు విలన్ ఆఫర్లే వస్తున్నాయట.
స్టార్ హీరోగా సెటిల్ అయ్యేందుకు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న సత్యదేవ్‌కు.. హీరో కంటే ఎక్కువగా విలన్ పాత్రలే తలుపు తడుతున్నాయట. అయితే విలన్ పాత్రలను ఎంచుకోవడం స్టార్ట్ చేశారంటే.. హీరో ఆఫర్లు క్రమంగా తగ్గిపోతాయి. ఈ నేపథ్యంలోనే సత్యదేవ్ విలన్ పాత్రలను ఎంచుకోవాలా..? వద్దా..? అన్న అయోమయంలో పడిపోయాడని జోరుగా టాక్ నడుస్తోంది. మొత్తానికి గాడ్ ఫాదర్ వల్ల సత్యదేవ్ పెద్ద తలనొప్పే వచ్చిందని అంటున్నారు.
https://newsorbit.com/news/netizens-shocked-after-seeing-hero-family-photo.html