టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ గత కొంతకాలం నుంచి వరుస ప్లాపులతో సతమతం అవుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఈయన `లైగర్` మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడింది. సగం వసూళ్లను కూడా రాబట్టలేకపోవడంతో.. అటు నిర్మాతలకు, ఇటు బయ్యర్లకు భారీ నష్టాలను మిగిల్చింది.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ తన ఆశలన్నీ `ఖుషి` మూవీ పైనే పెట్టుకున్నాడు. ఈ సినిమాతో అయినా హిట్ కొట్టి సక్సెస్ ట్రాక్ ఎక్కాలని ఆశపడుతున్నాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఇది. ఇందులో సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యేర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 23న తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుందని ఎప్పుడో మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ఇప్పటికే సగానికిపైగా షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. మిగిలిన భాగాన్ని కూడా త్వరత్వరగా కంప్లీట్ చేయాలని భావిస్తున్నారు. అయితే సమంత వల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతోందట. అక్టోబర్ నుంచి `ఖుషి` ఆఖరి షెడ్యూల్ ను స్టార్ట్ చేయాలని భావించారు. కానీ, సమంత డేట్స్ దొరకడం లేదట.
షూటింగ్ ఆలస్యమైతే విడుదలను పోస్ట్ పోన్ చేయాల్సి ఉంటుంది. ఈ విషయంపైనే విజయ్ దేవరకొండ వర్రీ అవుతున్నాడట. మొత్తానికి ఖుషి మూవీ తో ఎలాగైనా హిట్ కొట్టాలని తెగ ఆరాట పడుతున్న విజయ్ దేవరకొండకు.. ఇప్పుడు సమంత పెద్ద తలనొప్పిగా మారిందని టాక్ నడుస్తోంది.
https://www.instagram.com/p/CdmtBJ_r6Aj/?utm_source=ig_web_copy_link