టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే గత కొంత కాలం నుండి వరుస ఫ్లాపులతో మునిగిన సంగతి తెలిసిందే. ఈమె చివరిగా `రాధేశ్యామ్`, `బీస్ట్`, `ఆచార్య` వంటి పెద్ద చిత్రాలతో ప్రేక్షకులను పలకరించింది. అయితే భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడ్డాయి. దీంతో పూజా హెగ్డేను ఐరన్ లెగ్ అంటూ చాలా మంది ట్రోల్ చేశారు.
ముఖ్యంగా తమిళంలో ఆమె చేసిన తొలి చిత్రం `బీస్ట్` పెద్ద ఫ్లాప్ గా మిగిలిపోయింది. దాంతో అక్కడి సినీ ప్రియులు పూజా హెగ్డేపై విమర్షల వర్షం కురిపించారు. ఇక కోలీవుడ్ నుంచి ఆమెకి అవకాశాలు రావడం కూడా కష్టమే అన్న టాక్ వచ్చింది. కానీ, ఇప్పుడంతా రివర్స్‌లో జరుగుతోంది. వరుస ఫ్లాపుల్లోనూ పూజా హెగ్డే తగ్గేదే లే అంటోంది.
తాజాగా కోలీవుడ్ నుండి ఈ బ్యూటీని ఓ బిగ్ ఆఫర్ వరించింది. అది కూడా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సినిమాలో అట. ప్రస్తుతం సూర్య బాలా, వెట్రిమారన్ వంటి దర్శకులతో సూర్య సినిమాలు చేస్తున్నారు. ఆ తరువాత ప్రాజెక్టును ఆయన శివతో చేయబోతున్నాడు. అయితే ఈ సినిమా కోసమే పూజా హెగ్డేను హీరోయిన్గా తీసుకున్నారట.
అధికారిక ప్రకటన లేకపోయినా.. ఇప్పుడు వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో ఆమె అభిమానులు `అది మా బుట్టబొమ్మ అంటే.. ఫ్లాపులొచ్చినా క్రేజు తగ్గదు, అవకాశాలు తగ్గవు` అంటూ తమ హీరోయిన్ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. కాగా, పూజా హెగ్డే ఇతర ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే.. తెలుగులో ఈమె విజయ్ దేవరకొండ సరసన `జనగణమన`, మహేశ్ బాబుకు జోడీగా `ఎస్ఎస్ఎమ్బీ 28`లో నటిస్తోంది. వీటితో బాలీవుడ్‌లోనూ పలు ప్రాజెక్స్‌కు సైన్ చేసింది.