Entertainment News సినిమా

గోపీచంద్‌కు ఘోర అవ‌మానం.. జీర్ణించుకోలేక‌పోతున్న ఫ్యాన్స్‌!?

Share

టాలీవుడ్ మ్యాచ్ హీరో గోపీచంద్ కు ఘోర అవమానం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గత కొంతకాలం నుంచి వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న గోపీచంద్ రీసెంట్ గా `పక్కా కమర్షియల్` మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. మారుతి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో రాశి ఖ‌న్నా హీరోయిన్ గా నటిస్తే.. సత్యరాజ్, రావు రమేష్, సియా గౌతమ్ తదితరులు కీలక పాత్రలను పోషించారు.

జూలై 1న భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం.. ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. రూ. 16 కోట్ల బ్రేక్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా థియేట్రికల్ రన్ పూర్తయ్యే సమయానికి రూ. 8.81 కోట్ల షేర్‌ను మాత్రమే అందుకోగలిగింది. దీంతో ఈ సినిమా వ‌ల్ల‌ బయ్యర్లకు దాదాపు ఏడు కోట్లకు పైగా నష్టాలు వ‌చ్చిన‌ట్లు టాక్‌.

 gopichand pakka commercial trp rating
gopichand pakka commercial trp rating

ఇక‌పోతే ఈ సినిమాకు మిశ్ర‌మ స్పంద‌న ద‌క్క‌డంతో.. వెంట‌నే ఓటీటీలో దింపేశాలు. ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ ఆహాలో `పక్కా కమర్షియల్` స్ట్రీమింగ్ అయింది. అక్క‌డా ఈ సినిమా అంత‌గా ప్ర‌భావం చూప‌లేక‌పోయింది. పోని ఈ సినిమా టీవీలో అయినా మంచి టీఆర్సీని సొంతం చేసుకుంటుందేమో అని అభిమానులు ఆశ‌ప‌డ్డారు. కానీ, వారి ఆశ నిరాశే అయింది.

`ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌` శాటిలైట్ రైట్స్ ను సాలిడ్ రేటుకు సొంతం చేసుకున్న స్టార్ మా వారు.. ఇటీవ‌లె ఈ చిత్రాన్ని ఫస్ట్ టైం టెలికాస్ట్ చేశారు. అయితే ఈ మూవీ కేవలం 3.95 టీఆర్పీ రేటింగ్ ను మాత్రమే సొంతం చేసుకుంది. మ‌రీ ఇంత త‌క్కువ టీఆర్పీ రావ‌డం గోపీచంద్ కెరీర్ లోనే తొలిసారి. ఇది ఒక‌ర‌కంగా ఆయ‌న‌కు ఘోర అవ‌మాన‌మ‌నే చెప్పాలి. మ‌రోవైపు అంత త‌క్కువ టీఆర్పీ రావ‌డాన్ని ఫ్యాన్స్ కూడా జీర్ణించుకోలేక‌పోతున్నారు.


Share

Related posts

దిమాక్ ఖ‌రాబ్ చేస్తోన్న న‌భా న‌యా లుక్‌

Siva Prasad

నిశ్శబ్ధం కంటే నాని వి సినిమానే వెయ్యిరెట్లు బెటర్ .. కారణం ఇదే ..!

GRK

Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్ కోసం ప్రత్యేకంగా ఫైట్ .. సెట్ చేసిన డైరెక్టర్..!!

sekhar