బుల్లితెరపై సూపర్ డూపర్ హిట్ అయిన రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పటికే ఐదు సీజన్లను కంప్లీట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలె 6వ సీజన్ కూడా ప్రారంభం అయింది. ఈ సీజన్‌కు కూడా కింగ్ నాగార్జుననే హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.
రేవంత్, ఆరోహి, రాజశేఖర్, ఆదిరెడ్డి, ఫైమా, ఆర్జే సూర్య, ఇనయా సుల్తానా, షానీ సల్మాన్, వాసంతి కృష్ణన్, బాలాదిత్య, మెరీనా, రోహిత్, అభినయశ్రీ, గీతూ రాయల్, అర్జున్ కళ్యాణ్, శ్రీ సత్య, చలాకీ చంటీ, నేహా చౌదరి, శ్రీహాన్, సుదీప(పింకీ), కీర్తి భట్ మొత్తం 21 మంది కంటెస్టెంట్స్ ఈ సారి హౌస్‌లోకి అడుగు పెట్టారు.
తొలి వారమే బిగ్ బాస్ హౌస్ కోట్లాటలతో బిగ్ బాస్ హౌస్ రచ్చ రచ్చగా మారింది. ఇక నామినేషన్స్ విషయానికి వస్తే.. తొలి వారం ఏడుగురు నామినేషన్స్‌లోకి వచ్చారు. ఆల్రెడీ ఇనయా సుల్తానా, అభినయశ్రీ, బాలాదిత్యలు క్లాస్, ట్రాష్, మాస్ టాస్క్ ద్వారా డైరెక్ట్ నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక టాస్క్ అనంతరం నామినేషన్ ప్రక్రియ జరిగింది. ఆ ప్రాసెస్‌లో చివరాఖరకు ఆరోహి, ఇనయ, అభినయ శ్రీ, సింగర్ రేవంత్, జబర్దస్త్ ఫైమా, శ్రీ సత్య, చలాకీ చంటి నామినేషన్స్ జోన్లోకి వచ్చాయి.
నిజానికి ట్రాష్‌లో ఉన్న బాలాదిత్య కూడా నామిషేషన్స్ లో ఉండాల్సి ఉంది. అయితే బిగ్ బాస్ ట్విస్ట్ ఇస్తూ.. ట్రాష్‌లో ఉన్న ముగ్గురిలో ఒకర్ని సేవ్ చేయొచ్చని చెప్పడంతో.. క్లాస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ బాలాదిత్యని సేవ్ చేసి.. ఆ ప్లేస్‌లో ఆరోహిని డైరెక్ట్‌గా నామినేట్ చేశారు. ఇక నామినేషన్స్‌లో ఉన్న ఏడుగురిలో ఇనయ, ఆరోహి, శ్రీ సత్య డేంజర్లో ఉన్నారు. ఈ ముగ్గురిలోనే ఒకరు ఈ వారం ఎలిమినేట్ అవ్వొచ్చని బిగ్ బాస్ లవర్స్ భావిస్తున్నారు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!