MadhuraNagari Lo: బిగ్ బాస్ సీజన్ 6తో బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గర అయింది కీర్తి.. అంతకుముందే కీర్తి స్టార్ మా లో అడగక ఇచ్చిన మనసు సీరియల్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. కానీ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాక కీర్తి పాపులారిటీ డబల్ అయిందని చెప్పొచ్చు.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సొంతం చేస్తుంది.. తన గతం తెలుసుకున్న ప్రేక్షకులు ప్రతి ఇంట్లో కూడా కీర్తిని తమ సొంత కూతురులా భావిస్తున్నారు.. తాజాగా స్టార్ మా కీర్తి ప్రధాన పాత్రలో మధురానగరిలో అనే సీరియల్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సీరియల్ ప్రోమోను విడుదల చేయగా నెట్టింట వైరల్ అవుతుంది..
హలో నా పేరే మధుర నగర్.. నా కాలనీలో ఎన్నో పేర్లు ఎన్నో పాత్రలు మీరు ఇంతకుముందు ఎన్నడూ చూడని వింతలు.. విడ్డూరాలు.. చిట్టి పొట్టి ప్రేమ కథలు.. చిర్రు బుర్రు కోపాలు.. హే హసీనా నీకేం పని ఇక్కడ లోపలికి వీళ్ళందర్నీ కలుపుకుపోయేది రాధ.. ఈ కథలో నాయక.. బాబయి సారీ అమ్మా.. మ్యారేజ్ బ్యూరో రన్ చేస్తుంది అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకోవాలనుకునే వారికి నేను సంబంధాలు కుదరచును.. పే.. హూ హూ.. మీరిద్దరూ మంచి జోడి అవుతారు అని రాధా అనగానే.. ఒక బిడ్డకు తల్లి అయినా ఒంటరిగా ఉంటున్నా నువ్వా ఈ జంటలను కలిపేది పోమ్మా.. అందరి మంచి కోరుకునే రాధ.. తన జీవితంలో సంతోషం ఎలా కోల్పోయింది.. చూడండి మధుర నగరిలో మీ స్టార్ మా లో అంటూ ప్రోమో ఎండ్ చేశారు . ఈ ప్రోమోకి జబర్దస్త్ కమెడియన్ చలాకీ చంటి వాయిస్ ఓవర్ ఇచ్చారు. అలాగే జబర్దస్త్ లోని ఓ ఇద్దరూ కమెడియన్స్ కూడా ఈ సీరియల్ లో నటిస్తున్నారు. ఇక ఈ ప్రోమో కింద కీర్తి సీరియల్ కోసం ఈగరుగా వెయిట్ చేస్తున్నామంటూ ఆమె ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.