న్యూస్ ఆర్బిట్ ప్రత్యేకం, అక్టోబర్ 11-10-2023: బిగ్ బాస్ 7’ ఇప్పుడు రసవత్తరంగా మారింది. ఊహించని విధంగా మొ న్న ఆదివారం ఎపిసోడ్ లో కొందరు కంటెస్టెంట్లు హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. వాళ్ళే భోలే సావళి,పూజా, నయని , అశ్విని శ్రీ, అర్జున్ అంబటి, పూజా మూర్తి వంటి వారు. వాళ్లలో ప్రేక్షకులకి తెలిసిన వారు ఒకరిద్దరు మాత్రమే. ఆ తెలిసిన వాళ్ళ లిస్ట్ లో నయని పావని ఒకరు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవారు ఈమెను ఇట్టే గుర్తుపట్టేస్తారు అనడంలో అతిశయోక్తి లేదు. మొదట టిక్ టాక్ వీడియోలతో బాగా పేరు తెచ్చుకున్న తర్వాత ఇంస్టాగ్రామ్ రీల్స్ ద్వారా సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

దానితోపాటు షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్ అలాగే కొన్ని సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించి నప్పించింది. దానితోపాటు టీవీ షోలలో సైతం మెరిసింది. శ్వేత నాయుడుతో కలిసి డాన్స్ లు వేస్తూ కవర్ సాంగ్స్ ఆల్బమ్స్ వంటివి చేస్తూ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో రెగ్యులర్గా హాట్ అండ్ క్యూట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఆ మత్తు కళ్ళు పొట్టి దుస్తులు చూసిన వారు ఎవరైనా సరే ఒక్కసారి ఈమెని. ఒక్కసారి చూడాలని అనుకుంటారు. రోజురోజుకి ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచు కుని ఇప్పుడు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ ముద్దుగుమ్మ బిగ్బాస్ హౌస్లో ఎంతకాలం కొనసాగుతుంది ఆట ఎలా ఆడుతుంది అన్నది చూడాలి..!!

ఆమె గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం నయని పావని 1998 ఆగస్టు 23న జన్మించింది. ఈమె తెలంగాణాకు చెందిన అమ్మాయే.ఈమె అసలు పేరు సాయి పావని రాజు. ఈమె హిందూ కుటుంబానికి చెందిన అమ్మాయినే అని చెప్పకనే చెప్పింది. ముందుగా ఈమె టిక్ టాక్ వీడియోలతో కెరీర్ ను ప్రారంభించింది.ఈమె చేసిన టిక్ టాక్ వీడియోలు బాగా వైరల్ అయ్యేవి. అలాగే యూట్యూబ్ లో కూడా పలు షార్ట్ ఫిలిమ్స్ తో సందడి చేసేది.

‘సమయం లేదు మిత్రమా’, ‘ఎంత ఘాటు ప్రేమ’, ‘పెళ్లి చూపులు 2.0’, ‘మిత్రమా’, ‘బబ్లూ వర్సెస్ సుబ్బులు కేరాఫ్ అనకాపల్లి’ వంటి పలు షార్ట్ ఫిలింస్ లో ఈమె నటించడం జరిగింది.
అంతేకాదు నయని పావని.. ‘ఢీ’ షో లో కూడా పాల్గొని ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ‘చిత్తం మహారాణి’, ‘సూర్యకాంతం’ వంటి చిత్రాల్లో ఈమె నటించడం జరిగింది. ఆ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి కాబట్టి ఈమెకు ఆశించిన స్థాయిలో గుర్తింపు లభించలేదు.అందానికి అందం, దానికి మించి టాలెంట్ ఉన్న ఈ బ్యూటీ కి అవకాశాలు అయితే ఆశించిన స్థాయిలో రాలేదు.

అందుకే ఈమె ‘బిగ్ బాస్ 7’ లో ఎంట్రీ ఇచ్చినట్టు అంతా అనుకుంటున్నారు. బిగ్ బాస్ ద్వారా ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరైతే.. వరుసగా సినిమా అవకాశాలు కూడా వస్తాయని ఈమె భావిస్తున్నట్లు తెలుస్తోంది.అయితే నయని పావని ఇటీవల తన సోషల్ మీడియా లో పెట్టిన ఈ ఫోటోలను చూసి ఆగలేక కొంత మంది ఎలా ప్రవర్తిస్తున్నారో మీరే చూడండి.
‘రైతు కన్నీరు రాష్ట్రానికి క్షేమం కాదు’