Bigg Boss 7: తెలుగు బుల్లితెరలో బిగ్ బాస్ కి మించిన ప్రోగ్రాం మరొకటి లేదు…అందుకే 6 సీసన్లు ముగించుకుని కొత్త ఉత్సాహం తో బిగ్ బాస్ 7 మొదలైన సంగతి తెలిసిందే, నూతన కంటెస్టెంట్స్ లో తెలుగు వారికి జానకి కలగనలేదు సీరియల్ ధ్వారా బాగా పరిచయం ఉన్న ప్రియాంక జైన్, అంతగా పరిచయం లేని రతిక రోజ్, ఇప్పటికే షో లో వారి ప్రదర్శనతో చాలా మంది ఫాన్స్ ని సంపాదించుకున్నారు. అయితే షో ప్రొడ్యూసర్లు మాత్రం ఎవరి విలువ ఎంతో అని పారితోశకం తో ముందే తేల్చి చెప్పేసారు. ఇది తెలిసిన తరువాత ‘అయ్యో రతికకు ఇంత తక్కువా? కారణం ఏమయివుంటుంది?’ అని అభిమానులు అనుకోకుండా ఉంటారా చెప్పండి?

Rathika Rose Vs Priyanka Jain: రాతికకు లేనిది ప్రియాంకకు ఉన్నది అదేనా?
Bigg Boss 7: రతిక రోజ్ ఒక వారం సంపాదన ఎంత అంటే?
అనుభవం విషయానికి వస్తే రతిక రోజ్ అంత తక్కువేమి కాదు నేను స్టూడెంట్ సార్ సినిమాలో ప్రధాన పోలీస్ పాత్ర, రాహుల్ సిప్లిగంజ్ తో ప్రేమాయణం, మంచి మోడలింగ్ కెరీర్, ఇలా ఇందులో ప్రియాంక జైన్ కంటే తక్కువ కాదు. ఇద్దరి దెగ్గర కావాల్సినంత మసాలా ఉన్నపిటికి బిగ్ బాస్ 7 ప్రొడ్యూసర్లు మాత్రం ప్రియాంకకే ఎక్కువ విలువ కట్టారు. బిగ్ బాస్ 7 లో రతిక కొనసాగినన్నాళ్లు ప్రతి వారానికి 1.75 లక్షల పారితోషకం తీసుకుంటుంది. ప్రియాంక మాత్రం వారానికి 2.5 లక్షలతో సుమారు 30% ఎక్కువ పేమెంట్ తీసుకుంటుంది.

అందుకే కారణం బిగ్ బాస్ 7 ప్రసారమయ్యే స్టార్ మా సీరియల్ ‘జానకి కలగనలేదు’, జానకి గా ఈ సీరియల్ లో ప్రియాంక జైన్ బాగా ఫేమ్ సంపాదించుకుంది, సీరియల్ కూడా స్టార్ మా కి కలిసొచ్చింది, ఇవి పరిగణలోకి తీసుకుంటే ప్రొడ్యూసర్స్ ప్రియాంక బుల్లి తెర పాపులారిటీకి ఎక్కువ విలువ ఇచ్చారు అని అర్ధం అవుతుంది.

కానీ ఇప్పడివరకు బిగ్ బాస్ 7 లో జరిగినదాన్ని చూస్తే రతిక చాలా బలంగా ముందుకు దూసుకువెళ్తుంది, టాస్క్లు కూడా పోటీతత్వం తో చేస్తుంది…ప్రొడ్యూసర్ల అంచనాలు తారుమారు అయ్యేలా అభిమానులు వోటింగ్ తో రతిక విలువను పెంచుతారా…వేచి చూడాల్సిందే.