
Bigg Boss 7 Eliminations: ఊహకు అందని ట్విస్టులతో బిగ్‌బాస్ రియాలిటీ షో విజయవంతంగా దూసుకెళ్తోంది. మునుపెన్నడూ లేని విధంగా ఈ సారి సరికొత్త కంటెంట్‌తో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తోంది. అసలు ఏ మాత్రం అంచనాలు లేకుండానే తెలుగులో మొదలైన ఈ రియాలిటీ షో.. చాలా తక్కువ సమయంలో సూపర్ సక్సెస్ అందుకుంది. వరుసగా 6 సీజన్లు విజయవంతం చేసుకుని ఇప్పుడు సీజన్-7లోనూ అదే దూకుడు కంటిన్యూ చేస్తోంది. సీజన్-7లో మొత్తం 14 మంది కంటెస్టెంట్లు హౌజ్‌లోకి అడుగు పెట్టారు. అందరూ తమ తమ ఆట తీరును ప్రదర్శిస్తూ.. తాము స్ట్రాంగ్‌గా ఉన్నామని సవాల్ విసురుతున్నట్లు అనిపిస్తోంది. సీజన్-7 ప్రారంభమై వారం రోజులకు దగ్గర పడింది. ఫస్ట్ వీక్ నామినేషన్ల విషయానికి వస్తే.. మొత్తం 14 మందిలో 8 మంది నామినేట్ అవ్వడం హైలెట్.

నామినేట్ అయిన వారిలో రతిక రోజ్, శోభా శెట్టి, పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్, గౌతమ్ కృష్ణ, దామిని, షకీలా, కిరణ్ రాథోడ్ ఉన్నారు. సెప్టెంబర్ 5వ తేదీన రాత్రి ుంచి ఓటింగ్ ప్రక్రియ మొదలు కాగా.. ఈ సారి పది ఓట్లు కాకుండా ఒక్క కంటెస్టెంట్‌కు ఒక్క ఓటు మాత్రమే వేసే విధానాన్ని అమలులోకి తీసుకొచ్చారు. మొదటి వారం ఊహించని ఓటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. మరి ఈ వారం ఎవరు సేఫ్ అవుతారు? ఎవరు ఎలిమినేట్ అవుతురానేది తెలుసుకుందామా?.

‘ఉల్టా ఫుల్టా’ కాన్సెప్ట్‌తో..
బిగ్‌బాస్ సీజన్-6 ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేదనే చెప్పుకోవచ్చు. ఎంతో ఆ సీజన్ తెలుగు ఆడియన్స్‌ను అలరించడంలో పూర్తిగా విఫలమైంది. దాంతో ఈ సారి బిగ్‌బాస్ కొత్త కొత్త కాన్సెప్టులతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సీజన్-7లో ఎన్నో ట్విస్టులు, సర్‌ప్రైజ్‌లు ఇస్తున్నారు. గతంలో ఎన్నడూ చూడని టాస్కులతో ముందుకు వస్తున్నారు. దాంతో ఈ సీజన్‌పై ఆరంభంలోనే అందరిలోనూ ఆసక్తి పెరిగిపోయిందని చెప్పుకోవచ్చు. అలా వచ్చిన ఉల్టా ఫుల్టా కాన్సెప్ట్ ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఈ టాస్క్‌లో కంటెస్టెంట్లు చిత్ర విచిత్ర విన్యాసాలు చేసి తెలుగు ఆడియన్స్‌కు దగ్గరయ్యారు.

సిల్లీ రీజన్స్‌తో ఎలిమినేషన్..
మొదటివారం ఎలిమినేషన్ ప్రక్రియ మొదలైంది. బిగ్‌బాస్ ఒక్కో కంటెస్టెంట్‌ను సపరేట్‌గా పిలిపించి మీరు ఎవర్ని నామినేట్ చేయాలని అనుకుంటున్నారని అందరినీ అడిగారు. ఇందులో చాలా మంది కంటెస్టెంట్లు సిల్లీ రీజన్స్ చెబుతున్నట్లు అనిపించింది. ఇంట్లో పనులు చేయడం లేదని, తిని ప్లేట్లు కడగటం లేదని, షూలు ఎక్కడంటే అక్కడ వదిలేస్తున్నారని, మాటల ప్రభావం, బాడీ షేమింగ్ వంటి కారణాలతో ఎవరికీ వారు కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేశారు.

ఊహించని రీతిలో ఓటింగ్..
బిగ్‌బాస్ సీజన్-7కు సంబంధించిన మొదటి వారం జరిగిన నామినేషన్స్ ప్రక్రియలో మొత్తం ఎనిమిది మంది నామినేట్ అయ్యారు. గతంలో మారిదిగా కాకుండా ఈ సారి హాట్‌స్టార్, మిస్డ్ కాల్స్‌తో కేవలం ఒక్క ఓటు వేసే అవకాశం మాత్రమే ఉంది. ఊహించని రీతిలో ఓటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. రైతు బిడ్డగా వచ్చిన పల్లవి ప్రశాంత్‌కు ఏకంగా 40 శాతం ఓట్లు పోలైనట్లు సమాచారం. ఇది బిగ్‌బాస్‌కే దిమ్మతిరిగే ట్విస్ట్ అని టాక్ వినిపిస్తోంది. ఓటింగ్‌లో అందరినీ వెనక్కి నెట్టి పల్లవి ప్రశాంత్ మొదటి స్థానంలో చేరుకున్నాడు. రెండో స్థానంలో రతికా రోజ్, మూడో స్థానంలో శోభా శెట్టి, నాలుగో స్థానంలో గౌతమ్ కృష్ణ, ఐదో స్థానంలో షకీలా ఉన్నట్లు తెలిసింది. మొదటి వారం ఎలిమినేషన్ రౌండ్‌లో వీరు దాదాపు సేఫ్ అయినట్లు తెలుస్తోంది.

ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు?
మొదటి వారానికి సంబంధించిన జరిగిన ఎలిమినేషన్ రౌండ్‌లో ప్రిన్స్ యావర్ ఆరో స్థానంలో ఉన్నాడు. దామిని ఏడో స్థానంలో ఉంది. ఎనిమిదో స్థానంలో నటి కిరణ్ రాథోడ్ ఉన్నారని తెలుస్తోంది. వీళ్ల ముగ్గురిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎక్కువగా కిరణ్ రాథోడ్ హౌజ్ నుంచి బయటకు వచ్చే ఛాన్సులు కనిపిస్తున్నాయి. అయితే ఉల్టా ఫుల్టా సీజన్ కావడంతో ఏమైనా జరగవచ్చని బుల్లితెర వర్గాలు చెప్పుకుంటున్నాయి.