Bigg Boss 7 Telugu: అనేక సందేహాల నడుమ తెలుగులోకి పరిచయమై.. ఎవరూ ఊహించని విధంగా చాలా భారీ స్థాయిలో స్పందనను అందుకున్న ఏకైక షో బిగ్ బాస్. పాశ్చాత్య సంస్కృతికి అద్దం పట్టే కాన్సెప్టుతో నడిచే ఈ షోకు మన ప్రేక్షకులు పడిపోయారు.బిగ్‍బాస్ తెలుగు 7వ సీజన్‍లో క్రమంగా వేడి పెరుగుతోంది. రెండో వారం నామినేషన్ల ప్రక్రియ వాదోప వాదాలు అరుపులు కేకల మధ్య సాగనుంది. మొదటి వారం కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ కాగా.. ప్రస్తుతం హౌస్‍లో 13 మంది పోటీదారులు ఉన్నారు. ఇవాళ్టి ఎపిసోడ్‍లో రెండో వారం నామినేషన్ల ప్రక్రియ జరగనుంది. ప్రతీ కంటెస్టెంట్ ఎవరినో ఒకరిని ఎలిమినేషన్ కోసం నామినేట్ చేయాల్సి ఉంది. అయితే, ఈ నామినేషన్ల తంతు చాలా హాట్‍హాట్‍గా సాగనుంది. ఈ రోజు ఎపిసోడ్‍కు చెందిన ప్రోమో చూస్తే ఇది అర్థమవుతోంది. ముఖ్యంగా సీనియర్ యాక్టర్ శివాజీపై హౌస్‍లో ఎక్కువ మంది గుర్రుగా ఉన్నట్టు కనిపిస్తోంది.
బిగ్ బాస్ ఏడో సీజన్‌లోకి ప్రియాంక జైన్, హీరో శివాజి, సింగర్ దామిని, నటుడు ప్రిన్స్ యావర్, శుభ శ్రీ, నటి షకీలా, కొరియోగ్రాఫర్ సందీప్, శోభా శెట్టి, టేస్టీ తేజ, నటి రతికా రోజ్, నటుడు గౌతమ్ కృష్ణ, నటి కిరణ్ రాథోడ్, రైతు పల్లవి ప్రశాంత్, సీరియల్ హీరో అమర్‌దీప్‌లు ఎంట్రీ ఇచ్చారు. వీరి నుంచి మొదటి వారం జరిగిన ఎలిమినేషన్‌లో కిరణ్ రాథోడ్ షో నుంచి వెళ్లిపోయిన విషయం తెలిసిందే.

నామినేషన్స్‌పై స్పెషల్‌గా:బిగ్ బాస్ షోలో ప్రతి సోమవారం జరిగే ఎపిసోడ్‌లోనే నామినేషన్స్ టాస్కును చూపిస్తారు. షో మొత్తానికి ఊపిరిని పోసే కంటెంట్ ఇందులోనే దొరుకుతుంది. కాబట్టి దీనిపై నిర్వహకులు స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలిసింది. ఇందుకోసం గతంలో వాడిన టాస్కులను కాకుండా ప్రస్తుతం ప్రసారం అవుతోన్న ఏడో సీజన్ కోసం సరికొత్త కంటెంట్‌తో రాబోతున్నారని ప్రచారం జరుగుతోంది.

రెండో వారంలో బిగ్ ట్విస్ట్:బిగ్ బాస్ వర్గాల ద్వారా అందుతోన్న సమాచారం ప్రకారం.. ఏడో సీజన్ రెండో వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియను గతంలో మాదిరిగా కాకుండా సరికొత్తగా ప్లాన్ చేశారు. బిగ్ బాస్ ఒక కంటెస్టెంట్‌ను పిలవగా.. అతడు లేదా ఆమెను ఎవరైతే నామినేట్ చేయాలనుకున్నారో ఒకరి తర్వాత ఒకరు వచ్చి నామినేట్ చేయాలి. ఇందుకోసం బటన్ నొక్కి వాళ్లపై నీళ్లు జల్లాలి.

సాధారణంగానే నామినేషన్స్ టాస్కులో గొడవలు జరుగుతూ ఉంటాయి. అందుకు అనుగుణంగానే రెండో వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియలో కొందరు కంటెస్టెంట్ల మధ్య గొడవలు జరిగినట్లు తెలిసింది. మరీ ముఖ్యంగా శివాజితో ప్రియాంక జైన్, అమర్‌దీప్ వాదన పెట్టుకున్నారు. అలాగే, సందీప్ మాస్టర్‌తో ప్రిన్స్ యావర్, రతికాతో టేస్టీ తేజ గొడవలు పెట్టుకున్నారు. Meenakshi Chaudhary: బయటపడిన హీరోయిన్ భారీ అందాలు.. అసలు ఇది డ్రెస్సేనా గురూ! మొత్తం 8 మంది నామినేట్:బిగ్ బాస్ ఏడో సీజన్‌లోని రెండో వారానికి సంబంధించి జరిగిన నామినేషన్స్ ప్రక్రియ గత రాత్రే ముగిసింది. ఇక, తాజా సమాచారం ప్రకారం.. ఇందులో మరోసారి ఎనిమిది మంది నామినేట్ అయ్యారు.

అందులో ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్, రతికా రోజ్, శోభా శెట్టి, అమర్‌దీప్ చౌదరి, శివాజి, టేస్టీ తేజ, దామినిలు ఉన్నట్లు ఓ న్యూస్ తాజాగా బయటకు వచ్చేసింది. సందీప్‌కు స్పెషల్ పవర్:తాజాగా రిలీజ్ అయిన ప్రోమోలో నామినేషన్స్ టాస్క్ జరిగిన తీరును చూపించారు. ఇక, చివర్లో పవర్ ఆస్త్రాన్ని గెలిచి ఇమ్యూనిటీ పొందిన సందీప్‌కు బిగ్ బాస్ ఓ స్పెషల్ పవర్ ఇచ్చినట్లు చూపించారు. దీనిబట్టి అతడు మరో కంటెస్టెంట్‌ను నేరుగా నామినేట్ చేసే అవకాశం పొందాడు. మరి అతడు ఎవరిని నామినేట్ చేశాడో అన్నది మాత్రం సస్పెన్స్‌గా మారిపోయింది.