BiggBoss 7 Telugu 2nd Week Voting: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 తెలుగులో రెండో వారం నామినేషన్స్ చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగింది. ఎందుకంటే ఈ నామినేషన్స్ వల్ల హౌజ్‌లో ఎవరి రంగులు వారు మారుస్తున్నారు? ఎవరి డబుల్ గేమ్ వారు ఆడుతున్నారు? ఎవరెవరు సేఫ్ గేమ్ ఆడుతున్నారనేది అర్థమైపోయింది. తొలి వారం తక్కువ ఓట్లు వచ్చిన కారణంగా కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయిపోయింది. సోమవారం, మంగళవారం జరిగిన ఎలిమినేషన్స్ హీట్ పెంచాయి. శివాజీని అమర్‌దీప్, శోభాశెట్టి, ప్రియాంక, దామిని నామినేట్ చేశారు. పల్లవి ప్రశాంత్‌ని గౌతమ్, అమర్‌దీప్, తేజ, షకీలా, దామిని, ప్రియాంక నామినేట్ చేశారు. అలాగే పవర్ అస్త్ర సొంతం చేసుకున్న సందీప్.. ప్రిన్స్ యావర్‌ను నేరుగా నామినేట్ చేశాడు. రతికను గౌతమ్, శోభాశెట్టిని శివాజీ నామినేట్ చేశారు. వీళ్లతో పాటు గౌతమ్, అమర్‌దీప్, టేస్టీ తేజ, షకీలా కూడా ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నారు. గత వారంతో పోలిస్తే.. నామినేషన్స్‌లోకి అమర్ దీప్, శివాజీ, తేజ కొత్తగా చేరినట్లు తెలుస్తోంది. ఇలా దాదాపు 9 మంది ఉన్నారు. మరి ఈ సారి ఎవరు ఎలిమినేట్ అవుతారో వేచి చూడాలి.

ఈ వారం ఎలిమినేషన్స్‌లో అందరూ పల్లవి ప్రశాంత్‌పైనే ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. గమ్మత్తైన విషయం ఎంటంటే మొన్నటి వరకు పల్లవి ప్రశాంత్-రతిక రోజ్ మధ్య లవ్ ట్రాక్ నడుస్తోందని భావించిన తెలుగు ప్రేక్షకలు ఒక్కసారిగా నామినేషన్స్ రౌండ్‌లో షాకయ్యారు. రైతు బిడ్డతో ఓ హీరోయిన్ ఇంత క్లోజ్‌గా ఉంటుందా? అనుమానులు వచ్చేలా బిహేవ్ చేశారు. ఇద్దరి మద్య ఏదో లవ్ ట్రాక్ వర్కౌట్ అవుతుందని అనుకున్నారు. కానీ ఇందులో ఇద్దరి తప్పు ఉంది. బిగ్‌బాస్ హౌజ్‌లో ఎవరినీ తప్పు పట్టడానికి ఉండదు. ఎందుకంటే ఎవరి గేమ్ ప్లాన్ వాళ్లకు ఉంటుంది. పల్లవి ప్రశాంత్‌పై చాలా మంది కంటెస్టెంట్లు తీవ్రంగా కామెంట్లు చేశారు. సింపతి డైలాగ్స్‌తో ప్రేక్షకులను మోసం చేస్తున్నావని, రెండు మొఖాలు ఉన్నాయని, నీ ఒరిజినాలిటీని బయటకు తీయమని చెప్పారు. అమర్‌దీప్ పల్లవి ప్రశాంత్‌పై కామెంట్లు చేస్తున్నప్పుడు రతిక రోజ్ మధ్యలో ఇన్వాల్ అయి ఘోరంగా కామెంట్లు చేసింది. దాంతో ఆమె అసలు గేమ్ అర్థమైంది. హౌజ్‌లోకి వచ్చిన తర్వాత అసలు పల్లవి ప్రశాంత్ ఎవరో తెలియదన్నట్లు పరిచయం చేసుకుని.. నామినేషన్స్‌లో తన ఇంటర్వ్యూ చూశానని, ఒక పిల్లాడు ఇలా అన్నాడు.. అలా అన్నాడు అంటూ చెప్పుకొచ్చింది. పక్కాగా ప్లాన్ చేసుకుని వచ్చావనట్లు చెప్పుకొచ్చింది. హౌజ్‌లోకి ఎందుకు వచ్చావని డైరెక్ట్‌గానే నిలదీసింది. దాంతో తెలగు ప్రేక్షకులు షాకయ్యారు. మొన్నటి వరకు ఎంతో ఫ్రెండ్లీగా ఉన్న వీళ్లు మధ్య పెద్ద గేమ్ వార్ నడుస్తున్నట్లు తెలుస్తోంది.

మళ్లీ టాప్‌లో పల్లవి ప్రశాంత్..
ఈ వారం జరిగిన నామినేషన్స్‌లో 9 మంది నిలిచారు. మొదటి వారం ఓటింగ్‌లో టాప్‌లో నిలిచిన పల్లవి ప్రశాంత్ అదే దూకుడు ప్రదర్శించాడు. ప్రేక్షకులు మరోసారి పల్లవి ప్రశాంత్‌ను మళ్లీ టాప్‌లో నిలబెట్టి సేవ్ చేసినట్లు తెలుస్తోంది. 43.77 శాతం ఓటింగ్‌లో మొదటి స్థానంలో నిలిచాడు. ఆ తర్వాతి స్థానంలో అమర్‌దీప్ 17.86 శాతం, శివాజీ 15.9 శాతం, రతిక రోజ్ 9.43 శాతం, గౌతమ్ కృష్ణ 3.14 శాతంతో టాప్-5లో నిలిచారు.

ఎలిమినేట్ అయ్యేది ఎవరు?
ఈ సారి ఎలిమినేట్ అయ్యేది ఎవరో కన్‌ఫ్యూజన్‌గా ఉంది. ఉల్టా పుల్టా కాన్సెప్ట్ కావడంతో ఎవరైనా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరో స్థానంలో టేస్టీ తేజ కొనసాగుతున్నాడు. అతడికి 2.69 శాతం ఓటింగ్ లభించింది. ప్రిన్స్ యావర్‌కు 2,69 శాతం ఓట్లు నమోదయ్యాయి. శోభా శెట్టికి 2.33 శాతంగా ఓట్లు వచ్చాయి. ఓటింగ్‌లో చివరి స్థానంలో షకీలా ఉన్నారు. ఈమెకు 2.19 శాతం ఓట్లు మాత్రమే నమోదైంది. ఓటింగ్‌లో షకీలా చివరి స్థానంలో ఉంది. ఈ వారం ఆమెనే ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.