బుల్లితెర తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్‌బాస్ సీజన్-6 పూర్తి చేసుకుని సీజన్-7లోకి అడుపు పెట్టి వారం రోజులు దగ్గర పడింది. మొత్తం 14 మంది కంటెస్టెంట్లు బిగ్‌బాస్ హౌజ్‌లోని ఎంట్రీ ఇచ్చారు. ఈ వారం నామినేషన్స్ కూడా పూర్తయ్యాయి. ఎప్పటిలాగే ఒకరిపై మరొకరు గొడవలు పడటం, కామెడీ, టాస్కులు, లవ్ ట్రాక్ వంటి థీమ్‌తో షో ముందుకు సాగుతోంది. మొదటి వారంలో ఉల్టాఫుల్టా’ అనే థీమ్‌తో బిగ్‌బాస్ ముందుకొచ్చింది. ఈ థీమ్ ప్రేక్షకులను కొంత వరకు మెప్పించింది. హౌజ్‌లో టాప్-5 కంటెస్టెంట్లకు బ్రీఫ్ కేస్ ఆఫర్ కూడా ఇచ్చారు. కానీ తాము టైటిల్‌తోనే బయటకు వెళ్తామని బిగ్‌బాస్ ఇచ్చిన ఆఫర్‌ను తిరస్కరించాయి. అయితే హౌజ్‌లో మరికొంత మంది కంటెస్టెంట్లు రానున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే ఏడో సీజన్ కంటెస్టెంట్ల రెమ్యూనరేషన్‌కు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గత సీజన్లతో పోలిస్తే ఈ సారి హౌజ్‌లోకి వచ్చిన చాలా మంది కంటెస్టెంట్లకు తక్కువ మొత్తంలో ఫీజు చెల్లిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంత తక్కువ మొత్తంలో రెమ్యూనరేషన్ ఇవ్వడంపై బిగ్‌బాస్ నిర్మాతలపై నెటిజన్లు మండిపడుతున్నారు. రెండు చేతుల్లా సంపాదిస్తున్నారుగా? ఇంత తక్కువ మొత్తంలో రెమ్యూనరేషన్ ఇవ్వడంపై తీవ్ర వ్యతిరేక వస్తోంది. అయితే హోజ్‌లో ఎక్కువ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్న వారు, తక్కువ మొత్తంలో పారితోషికం తీసుకుంటున్న వారి వివరాలను తెలుసుకుందాం..

తక్కువ మొత్తంలో పారితోషికం తీసుకుంటుంది వీరే..
బిగ్‌బాస్ ఏడో సీజన్‌లో మొదటి కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన ప్రముఖ సీరియల్ నటి ప్రియాంక జైన్ వారానికి రూ.2.5 లక్షల పారితోషికం తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే బహుబలి సింగర్ దామినీ భట్ల రూ.2 లక్ష్లు తీసుకుంటోందట. హీరోయిన్ రతికాకు కూడా అంతే మొత్తంలో రెమ్యూనరేషన్ ఇస్తున్నారట మేకర్స్. కార్తీక దీపం సీరియల్ ఫేమ్ శోభాశెట్టికి వారానికి రూ.2.5 లక్షలు ఆఫర్ చేశారట. మరో నటి లాయర్ శుభశ్రీకి రూ.2 లక్షలు, నటుడు గౌతమ్ కృష్ణకు రూ.1.75 లక్షలు, మోడల్ ప్రిన్స్ యావర్‌కు రూ.1.5 లక్షలు తీసుకుంటున్నారట.
ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆట సందీప్‌కు వారానికి రూ.2.75 లక్షల పారితోషికం తీసుకుంటున్నారట. అలాగే ప్రముఖ సీరియల్ నటుడు జానకి కలగన లేదు ఫేమ్ అమర్ దీప్‌కు రూ.2.5 లక్షలు ఆఫర్ చేశారట. ప్రముఖ యూట్యూబర్, జబర్దస్త్ కమెడియన్ టేస్టీ తేజాకు రూ.1.5 లక్షలు ఇస్తున్నారట. అలాగే యూట్యూబర్, రైతు పల్లవి ప్రశాంత్‌కు వారానికి రూ.లక్ష మాత్రమే అందిస్తున్నారట. అయితే యూట్యూబ్, సీరియల్, మోడలింగ్‌కు చెందిన కంటెస్టెంట్లకు మాత్రమే తక్కువ మొత్తంలో రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

అధిక మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకునే కంటెస్టెంట్లు వీరే..
కంటెస్టెంట్లలో ముగ్గురు, నలుగురు మాత్రమే సీనియర్లు. మిగిలిన కంటెస్టెంట్లు పెద్దగా పరిచయం లేదనే చెప్పుకోవాలి. సీనియర్ నటీ షకీలాకు రూ.3.5 లక్షల పారితోషికం తీసుకుంటున్నారట. ఒకప్పటి హీరోయిన్ కిరణ్ రాథోడ్‌కు రూ.3 లక్షలు తీసుకుంటున్నారట. అయితే బిగ్‌బాస్ కంటెస్టెంట్లలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న వారిలో నటుడు శివాజీ ఉన్నారు. శివాజీకి వారానికి రూ.4 లక్షలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. పారితోషికం తీసుకుంటున్న వారిలో టాప్ ప్లేస్‌లో శివాజీ ఉండగా.. ఆఖరి స్థానంలో పల్లవి ప్రశాంతం ఉన్నారు. అయితే కంటెస్టెంట్ల పారితోషికంపై బిగ్‌బాస్ క్లారిటీ ఇవ్వలేదు. కానీ బిగ్‌బాస్ సీజన్-7లో ఇంత తక్కువ మొత్తంతో రెమ్యూనరేషన్ ఇవ్వడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. బిగ్‌బాస్ నిర్మాతలు బాగానే సంపాదిస్తున్నారుగా? వీళ్లకు ఇదేం కక్కుర్తి అని ఆరోపిస్తున్నారు.