
Bigg Boss 7 Telugu Voting: బిగ్‌బాస్ సీజన్ 7 తెలుగు చాలా ఇంట్రెస్టింగ్‌గా కొనసాగుతోంది. కంటెస్టెంట్లు పోటా పోటీగా తలబడుతున్నారు. ఉల్టా పల్టా కాన్సెప్ట్‌తో సీజన్-7 ప్రేక్షకులను తన వైపు తిప్పుకోవడానికి బిగ్‌బాస్ తెగ ప్రయత్నం చేస్తోంది. బిగ్‌బాస్ సీజన్ 6 పూర్తిగా ప్లాప్ అవ్వడంతో ఈ సారి కొత్త కాన్సెప్ట్‌తో ముందుకు వచ్చిన ఈ షో రెండో వారం విజయవంతంగా కొనసాగుతోంది. అమ్మాయిలు, అబ్బాయిలు అనే తేడా లేకుండా గట్టీగా పోటీ పడుతున్నారు. బిగ్‌బాస్ సీజన్‌లో కంటెస్టెంట్‌గా వచ్చిన వారిలో రతిక రోజ్ ఒకరు. ఈ అమ్మడు తన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. డ్యాన్స్ పర్ఫార్మెన్స్‌తో బిగ్‌బాస్ స్టేజ్‌ను షేక్ చేసిన ఈ భామ తన క్యూట్‌నెస్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. బిగ్‌బాస్‌ను ‘పెద్దయ్య.. పెద్దయ్య..’ అంటూ కామెడీ పండిస్తూనే అందరికీ దగ్గరైంది. హౌజ్‌లో పల్లవి ప్రశాంత్‌తో లవ్ ట్రాక్ నడిపి ఆమెపై హైప్ క్రియేట్ చేసుకుంది. రాహుల్ సిప్లిగంజ్‌తో బ్రేకప్ అయిన విషయాన్ని చెబుతూ తన గుండెలోని భారాన్ని బయటకు తీసింది. ఇంతకీ ఎవరీ రతిక రోజ్? ఆమె ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఏ ఏ సినిమాల్లో నటించింది? ఆమెకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు కుర్రాళ్లు సోషల్ మీడియాలో తెగ సెర్చ్ చేస్తున్నారు. ఆమెకు సంబంధించిన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

రతిక రోజ్ అసలు పేరు ప్రియ. ఈ భామ ఆంధ్రప్రదేశ్‌లో పుట్టింది. ప్రస్తుతం ఆమె వయసు 28 సంవత్సరాలు. రతిక రోజ్ చిన్నప్పుడే వారి ఫ్యామిలీ హైదరాబాద్‌కు షిప్ట్ అయ్యారు. హైదరాబాద్‌లో ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేశారు. చిన్నప్పటి నుంచే రతికకు సినిమాలపై ఆసక్తి ఎక్కువ.

దాంతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టాలని అనుకుంది. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన ఈ భామ తన పేరును రతిక రోజ్‌గా మార్చుకుంది. మొదట్లో ప్రైవేట్ ఆల్బమ్స్ చేసిన ఈ భామ.. ఆ తర్వాత ఓ ప్రముఖ తెలుగు ఛానెల్‌లో స్టాండప్ కమెడియన్‌గా కూడా చేసింది. తన జోక్స్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. అలా ఏడాది ఏడాది పాటు టీవీ షోలో కనిపించి.. సడెన్‌గా మాయమైపోయింది. మళ్లీ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ.. తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.
‘బొమ్మ అదిరింది-దిమ్మ తిరిగింది’
కుమార్ కోట దర్శకత్వంలో 2021లో విడుదలైన సినిమా ‘బొమ్మ అదిరింది-దిమ్మ తిరిగింది’. రొమాంటిక్ హర్రర్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం హిట్ అందుకోలేదు. ఈ సినిమాలో షకలక శంకర్, ప్రియ (రతిక రోజ్), అర్జున్ కళ్యాణ్, రాజ్ స్వరూప్, మధు, స్వాతి, అవంతిక, హీనా, రతిక చక్రవర్తి, సంజన చౌదరి తదితరులు కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాతోనే రతిక రోజ్ ఫుల్ లెన్త్ పాత్రలో నటించారు. కరోనా బ్యాక్‌గ్రౌండ్‌లో ఓ హౌజ్‌లో చిక్కుకున్న వాళ్లకు పనిమనిషిలా రతిక రోజ్ పాత్ర మొదలవుతుంది. అయితే ఇందులో రతిక దెయ్యంగా కనిపిస్తుంది. ప్రేమ, ఫ్యామిలీని కోల్పోయిన దెయ్యం పాత్రలో రతిక నటించారు. సినిమా కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను అలరించినప్పటికీ సినిమా సాగదీతగా అనిపిస్తుంది. అందుకే సినిమా హిట్ అందుకోలేదని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత రీసెంట్‌గా వచ్చిన బెల్లంకొండ గణేష్ ‘నేను స్టూడెంట్ సార్’ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది. ఈ సినిమాతో రతిక రోజ్‌కు మంచి గుర్తింపే వచ్చింది. బిగ్‌బాస్ ద్వారా తన కెరీర్ టర్న్ అవుతుందని భావించిన ఈ భామ సీజన్-7లోకి ఎంట్రీ ఇచ్చింది.

హౌజ్‌లో అల్లరి పిల్లగా..
బిగ్‌బాస్ హౌజ్‌లో అల్లరి పిల్లగా రతిక రోజ్ ఎంట్రీ ఇచ్చింది. మొదటి నుంచి తన క్యూట్‌నెస్‌తో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. పల్లవి ప్రశాంత్‌తో లవ్ ట్రాక్ నడిపిస్తున్నట్లు అనిపించినా.. ఎలిమినేషన్స్‌లో ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. పల్లవి ప్రశాంత్‌పై ఆరోపణలు చేయడంతో తెలుగు ప్రేక్షకులు ఒక్కసారిగా షాకవుతున్నారు. అది చూసిన ఆడియన్స్ రతిక రోజ్ పక్కా గేమ్ ప్లాన్‌తో ఆడుతున్నట్లు ఫిక్స్ అయ్యారు. మొదట్లో ఫేమ్‌ని వాడుకుని.. ఆ తర్వాత తనపై ఫోకస్ పెంచుకున్న తర్వాత అసలు గేమ్ స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. మొదట్లో నవ్వుతూ, ఫ్రెండ్లీగా కనిపించినా.. తనలోనూ యాంగ్రీ ఉమెన్ ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఫ్యూచర్‌లో గేమ్ ప్లాన్ ఎలా ఉంటుందో వేచి చూడాలి.