Bigg Boss 7 Telugu Wild Card Entry: బిగ్‌బాస్ సీజన్ 7 తెలుగు రసవత్తరంగా సాగుతోంది. మొదటి వారం కాస్త డీలా అనిపించినా.. నామినేషన్స్, ఎలిమినేషన్స్, గేమ్స్‌తో మంచి హైప్ క్రియేట్ చేశారు. టోటల్‌గా ఉల్టా ఫుల్టా కాన్సెప్ట్‌తో ప్రేక్షకులకు మరింత ఆసక్తి పెంచుతున్నారు. తొలి వారం సాదాసీదాగా సాగినా.. రెండో వారం కాస్త పుంచుకుంది. ముఖ్యంగా నామినేషన్స్ ఎపిసోడ్ షోపై మరింత హైప్‌ను పెంచాయి. తాజాగా వైల్డ్ కార్డ్ ఎంట్రీలను హౌజ్‌లోకి పంపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సీజన్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలలో ఎక్కువగా వినిపించిన పేరు ‘అర్జున్ అంబటి’.

అయితే బిగ్‌బాస్ హౌజ్‌లో వెళ్లిన 14 మంది కంటెస్టెంట్లలో అర్జున్ అంబటి లేడు. అయితే ఇప్పుడు రెండు వారాల తర్వాత ఆటను మరింత ఆసక్తికరంగా పెంచేందుకు అర్జున్ అంబటిని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌజ్‌లోకి పంపబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అర్జున్ అంబటి హౌజ్‌లోకి ఎంట్రీ ఇస్తే ఆట ఇంకా రంజుగా మారునుంది. ఇప్పటికే హౌజ్‌లోని సీరియల్ బ్యాచులు గ్రూపులు కట్టారు. అందరూ ఒకే మాట, ఒకే బాట, ఒకే ఆట అన్నట్లు గ్రూపులు సాగిస్తున్నారు. ఒకవేళ అర్జున్ అంబడి కూడా హౌజ్‌లోకి ఎంట్రీ ఇస్తే సీరియల్ బ్యాచ్‌లో చేరుతాడా?.. సింగిల్‌గానే తన ఆట ఆడుతాడా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.
అర్జున్ అంబటి వ్యక్తిగత జీవితం..
1986 ఆగస్టు 16న ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో అర్జున్ అంబటి జన్మించాడు. ఆయన తండ్రి సుబ్బారెడ్డి, తల్లి చంద్రావతి. ఇంజినీరింగ్ పూర్తి చేసిన అంబటి సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా పని చేశాడు. ఆ తర్వాత యాక్టింగ్ మీద ఇష్టం పెరగడంతో సినిమాల ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. ‘అర్ధనారి, గీతోపదేశం, సౌఖ్యం, జానకి రాముడు, దేశముదురు, సుందరి’ వంటి సినిమాల్లో నటించాడు. ఆ తర్వాత సీరియళ్లలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకున్నాడు. అగ్నిసాక్షి సినిమా ద్వారా మరింత గుర్తింపు పొందాడు. దాంతో ‘దేవత’ సీరియల్‌లో ఆఫర్ వచ్చింది.

సీరియల్స్ నుంచి బిగ్‌బాస్‌లోకి..
బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని వ్యక్తి అర్జున్ అంబటి. ఇప్పటివరకు ‘అగ్ని సాక్షి, దేవత’ వంటి సీరియళ్లలో నటించి ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేశాడు. 2014లో తన నటనా ప్రస్థానాన్ని ప్రారంభించిన అర్జున్.. ‘అర్థనారి’ సినిమాతో పేరు సంపాదించాడు. స్త్రీ, పురుష పాత్రల్లో నటించి అందరి ప్రశంసలు పొందాడు. సినిమాలు, సీరియళ్లు, పలు షోలలో పాల్గొన్నారు. ప్రస్తుతం బిగ్‌బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే బుల్లితెర ముందుకు రాకముందు అర్జున్ అంటి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసేవాడు. చెన్నై, హైదరాబాద్‌లోని పలు ఐటీ కంపెనీలలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేశాడు. ఆ తర్వాత సినిమాల్లో ఇంట్రెస్ట్ ఉండటంతో మోడల్‌గా కెరీర్ స్టార్ట్ చేశాడు. సినిమాల్లో అవకాశం రావడంతో సాఫ్ట్‌వేర్ జాబ్‌కు రిజైన్ చేశాడు. మొదట్లో చాలా మంది బెంగళూరు అబ్బాయి అనుకున్నారు. కానీ అర్జున్ అంబటిది విజయవాడలోని నర్సరావుపేటకు చెందిన వాడని తెలిసి అందరూ షాకయ్యారు. అర్జున్ అంబటి తండ్రి సినిమాల్లో ఫిల్మ్ డిస్టిబ్యూటర్‌గా పని చేసేవారు. దాంతో చిన్నప్పటి నుంచి సినిమాలపై ఆసక్తి పెరిగింది. ఉద్యోగంం చేస్తున్నప్పుడే సురేఖ అనే అమ్మాయితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ తర్వాత ఇరు కుటుంబాల అంగీకారంతో సురేఖను పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీతో పాటు పలు పండుగ ఈవెంట్లలో సందడి చేస్తున్నాడు. కొత్త సీరియల్ ఏమీ స్టార్ట్ కాకపోవడంతో బిగ్‌బాస్ ఆఫర్ యాక్సెఫ్ట్ చేసి ఉన్నట్లు తెలుస్తోంది. బిగ్‌బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు తన ఇన్‌స్టాగ్రామ్‌లో హింట్ ఇచ్చారు. దాంతో ఆ పోస్టు చూసిన పలువురు బిగ్‌బాస్ హౌజ్‌లోకి వెళ్తున్నందుకు శుభాకాంక్షలు చెబుతున్నారు. కాగా, బిగ్‌బాస్ హౌజ్‌లోకి సుడిగాలి సుధీర్, వర్షిణి తదితరులు కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలో క్లారిటీ రానుంది.