Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ హోర హోరీగా సాగుతోంది. ముఖ్యంగా కొత్త కంటెస్టెంట్స్ వచ్చిన తరువాత హౌస్ లో కొత్త వాతావరణం ఏర్పడింది. స్టార్టింగ్ 14 మంది సభ్యులు హౌస్ లో ఎంట్రీ ఇచ్చారు. ఐదు వారాలకు ఐదుగురు ఎలిమినేట్ అయిపోయారు. అయితే ఆరో వ్యక్తిగా ఎలిమినేట్ అయిన గౌతమ్ కృష్ణ నీ బిగ్ బాస్ సీక్రెట్ రూమ్ లో పెట్టడం తెలిసిందే. అయితే సీక్రెట్ రూమ్ లో హౌస్ లో సభ్యులు ఆట తీరు గమనించే అవకాశం దాదాపు 70 కెమెరాలలో వాళ్ళు ఆడుతున్న ఆట తీరు ఇంకా వ్యక్తులపై మాటలు అన్ని గమనించి చక్కగా గేమ్ ప్లాన్ తో రావాల్సిన గౌతమ్ కృష్ణ మరి బ్లైండ్ గేమ్ ఆడటం జరిగింది.
సోమవారం ఎపిసోడ్ లో నామినేషన్ ప్రక్రియ జరుగుతున్న టైములో ఒక్కసారిగా ఎంట్రీ ఇచ్చిన గౌతమ్… అశ్వద్ధామ ఇంకా ఏ ఏ ఓ పిచ్చిపిచ్చి డైలాగులు వేయడం జరిగింది. హౌస్ లో తనకేదో అన్యాయం జరిగినట్టు ఇంటి సభ్యుల మీద రెచ్చిపోయాడు. మొత్తం బరస్ట్ అయిపోయి.. తెలివిగా గేమ్ ఆడాల్సింది పోయి బయటపడిపోయాడు అని జనాలంటున్నారు. అశ్వద్ధామ ఇస్ బ్యాక్.. తేనె పూసిన కత్తి అంటూ పిచ్చిపిచ్చిగా సినిమా డైలాగులు వేసి సస్పెన్స్ లేకుండా తెలివి లేని గేమ్ గౌతం ప్రదర్శించారని అతని బదులు శివాజీని లోపలికి తీసుకెళ్తే హౌస్ లో ఇప్పుడు వేరే రకమైన వాతావరణము ఉండేదని జనాలు చెప్పుకుంటున్నారు.
ఒక మంచి అవకాశాన్ని కోల్పోయారని అంటున్నారు. ఇదిలా ఉంటే ఆరో వారం బిగ్ బాస్ హౌస్ లో అమర్ దీప్, యావర్, సందీప్, తేజా, శోభా, నయని, అశ్విని, పూజా మొత్తం ఎనిమిది మంది నామినేట్ అయ్యారు. అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వచ్చిన గౌతమ్ సందీప్ ను సేవ్ చేశాడు. పల్లవి ప్రశాంత్ కెప్టెన్ కావడంతో నామినేషన్ నుండి తప్పించుకోవడం జరిగింది.