Bigg Boss 7 Telugu: తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ హోరాహోరీగా సాగుతోంది. సెప్టెంబర్ మూడవ తారీకు ప్రారంభమైన ఈ సీజన్ లో మొత్తం 14 మంది హౌస్ లోకి వెళ్లారు. అయితే నాలుగు వారాలకి గాను నలుగురు ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం హౌస్ లో 10 మంది ఉన్నారు. ఈ వారం ఏడుగురు నామినేషన్ లో ఉన్నారు. పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు సీజన్ సెవెన్ లో సెకండ్ హాఫ్ గేమ్ స్టార్ట్ కాబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో ఇప్పుడు ఏకంగా హౌస్ లోకి ఆరుగురు టాప్ మోస్ట్ సెలబ్రిటీలు వైల్డ్ కార్డు రూపంలో ఎంట్రీ ఇవ్వడానికి ఏర్పాట్లు చేసినట్లు సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.
వాస్తవానికి గతంలో అన్ని సీజన్లలో హౌస్లో మొదటి రోజే దాదాపు 19 నుంచి 21 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. కానీ ఈసారి 14 మంది ఇవ్వగా ఇప్పుడు మెనీ లాంచ్ కార్యక్రమాన్ని అక్టోబర్ ఆరవ తారీకు షూట్ చేసి ఈ వీకెండ్ లో ప్రసారం చేసి ఆ వైల్డ్ కార్డు సభ్యులను హౌస్ లోకి పంపించడానికి నిర్వాహకులు రెడీ కావడం జరిగింది అంట.
అయితే ఈ ఆరుగురు టాప్ మోస్ట్ సెలబ్రిటీలు ఎవరంటే జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్, సీరియల్ నటుడు అంబాటి అర్జున్, నటీమణులు పూజ మూర్తి, అంజలి పవన్, నాయని పవన్, మ్యూజిక్ డైరెక్టర్ బోలే షామిలి. ఈ ఆరుగురు ఇంటిలోకి వెల్లబోతున్నట్లు మరి ఈ ఆరుగురిని ఆల్రెడీ హౌస్ లో ఉన్న సభ్యులు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. నిజంగా ఈ సీజన్ స్టార్ట్ అవ్వకముందే ఉల్టా పల్టా అంటూ ఎవరికి అర్థం కాని ట్విస్ట్ లు అని అన్నారు. ఇప్పుడు అదే విధంగా కొత్తగా ఆరుగురిని హౌస్ లోకి పంపించడం సంచలనంగా మారింది.