Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ 11వ వారం ఆట సాగుతోంది. సోమవారం నామినేషన్ పర్వం సాగింది. నామినేషన్ వేసేవారు నామినేట్ చేసే సభ్యురాలు గురించి మాట్లాడి కారణాలు చెప్పి బాటిల్ ను తలపై పగలగొట్టాలి. ఈ క్రమంలో నామినేషన్ లో రతిక చాలా సీరియస్ అయింది. 11వ వారం నామినేషన్ ప్రక్రియ నువ్వా నేనా అన్నట్టుగా సాగింది. నామినేట్ చేసే సభ్యుల గురించి ఎవరికి వారు కారణాలు తెలియజేస్తూ వచ్చారు. మొత్తం 11వ వారంలో నామినేట్ అయిన సభ్యులు 8 మంది. వాళ్లు ఎవరంటే ప్రిన్స్ యావర్, శోభా శెట్టి, అమర్ దీప్, రతిక, ప్రియాంక, అర్జున్, అశ్విని, గౌతమ్. సీజన్ సెవెన్ చాలా వరకు చివరకు వచ్చేసింది.
మరో నాలుగు వారాలు ఆట మాత్రమే మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈసారి టాప్ ఫైవ్ లో ఎవరు ఉంటారు అనేది ఆసక్తికరంగా మారింది. పదోవారంలో భోలే.. ఇంటి నుండి ఎలిమినేట్ కావటం జరిగింది. భోలే హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యాక కొద్దిగా ఎంటర్టైన్మెంట్ తగ్గినట్లు సోమవారం ఎపిసోడ్లో కనిపిస్తుంది. ఆయన వచ్చినప్పుడు నామినేషన్ సమయంలో.. సీరియస్ గా గొడవ జరుగుతున్న ఆయన వేసే డైలాగులు కొద్దిగా కామెడీని పండించేవి. అయితే ఆయన ఎలిమినేట్ కావడంతో 11వ వారం నామినేషన్ ప్రక్రియ సాదాసీదాగా జరిగింది.
ప్రస్తుతం హౌస్ లో పదిమంది సభ్యులు ఉన్నారు. వీరిలో శివాజీ, పల్లవి ప్రశాంత్, యావర్, అమర్ దీప్.. ఈ ముగ్గురు కచ్చితంగా.. కచ్చితంగా టాప్ ఫైలో ఉంటారని బయట ఆడియన్స్ చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా ఈసారి సీజన్ లో హౌస్ లో మంచి పోటీ వాతావరణం నెలకొంది. ఇంటిలో సభ్యులు..షో చూసే ఆడియెన్స్ ఊహించని విధమైన ట్విస్ట్ లతో బిగ్ బాస్ షో నిర్వాహకులు జాగ్రత్త పడటం జరిగింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ లో ఐదుగురు సభ్యులు.. ఎలిమినేట్ అయిన సభ్యులు కూడా హౌస్ లో మళ్ళీ ఆడటం ఈసారి కొత్తగా ఉంది. దీంతో సీజన్ సెవెన్ టైటిల్ ఎవరివసమవుతుందన్నది ఆసక్తికరంగా మారింది.