Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ చాలా రసవతారంగా సాగుతోంది. ఇంటిలో ఉన్న ఆటగాళ్లు చూస్తున్న ఆడియన్స్ ఎవరూ కూడా గేమ్ అంచనా వేయలేకపోతున్నారు. ఆ రకంగా బిగ్ బాస్ ఆటని ఆడిస్తున్నారు. ఒక్కసారిగా ఫైల్ కార్డు రూపంలో ఐదుగురిని ఇంటిలోకి పంపించటం.. ప్రారంభం నుండి ఆడుతున్న సభ్యులకు ఊహించిన షాక్ ఇచ్చినట్లయింది. ఇదిలా ఉంటే రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ఆటతీరులో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటి వరకు ఓ రకమైన గేమ్ ఆడుతూ వచ్చాడు. అయితే ఏడో వారంలో వైల్డ్ కార్డు ఎంట్రీ లు సభ్యులు వెళ్లిన తర్వాత ప్రశాంత్ ఆట తీరు మొత్తం మారిపోయింది. ఈ క్రమంలో మొదటిలో రైతుబిడ్డ అనే ట్యాగ్ తో సింపతి గేమ్ ప్రదర్శించడం జరిగింది.
ఆ తర్వాత ఇప్పుడు అదే రకమైన ధోరణితో ఆడుతూ అడ్డంగా బుక్ అయిపోయాడు. ఏడో వారం నామినేషన్ లో భాగంగా సందీప్ తనని ఊరోడు అని అన్నాడని.. అది తనకు నచ్చలేదని కారణం చెప్పాడు. ఇప్పుడు ఇదే విషయాన్ని హోస్ట్ నాగార్జున.. వీకెండ్ ఎపిసోడ్ లో ప్రస్తావించటం జరిగింది. ఈ సందర్భంగా నామినేషన్ ప్రక్రియలో జరిగిన గొడవ మొత్తం వీడియోలు ప్రదర్శించారు. నామినేషన్ సమయంలో రెచ్చిపోయి మాట్లాడిన ప్రశాంత్… నాగ్ అడిగిన ప్రశ్నలకు.. సైలెంట్ అయిపోయాడు. ఈ క్రమంలో ప్రశాంత్ తప్పుని పూజా, అర్జున్ లతో నాగార్జున చెప్పించడం జరిగింది. వారిద్దరూ ప్రశాంత్ మాటలు మార్చేస్తున్నారని చెప్పారు.
దీంతో రైతు బిడ్డ ప్రశాంత్ అసలు నిజ స్వరూపం బట్టబయలు అయింది. సందీప్ తో అలా కాదు ఇలా అని చెప్పే ప్రయత్నం చేసినట్లు ఆ సమయంలో సందీప్ అవకాశము ఇవ్వలేదని అన్నారు, కానీ అది కూడా అబద్ధమే అని వీడియోలో ప్రూవ్ అయింది. కానీ ఈ విషయాన్ని నాగ్ పెద్దగా సాగదీయకుండా.. చాలా సైలెంట్ గా ఫుల్ స్టాప్ పెట్టారు. ఇదే సమయంలో తన తండ్రి ఊరోడు అని చెప్పటంలో గర్వంగా ఉందని నాగార్జున స్పష్టం చేశారు. ఈ క్రమంలో మాటలు మారుస్తూ ప్రశాంత్ వ్యవహరించటంతో.. అతని గేమ్ కి కొద్దిగా మైనస్ అయింది.