Bigg Boss Telugu Damini Bhatla: బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్లు ఒక్కో పంథాతో ముందుకు వెళ్తున్నారు. హౌస్‌లో సేవ్ అవ్వడానికి ఎవరికి నచ్చిన స్ట్రాటజీలు వాళ్లు ప్లే చేస్తున్నారు. కొందరు మైండ్ గేమ్ ఆడుతుంటే.. మరికొందరు అందరితో కలివిడిగా మాట్లాడుతూ.. అన్ని పనుల్లో సాయం చేస్తూ.. కంటెస్టెంట్ల దృష్టిలో సేఫ్ అవుతున్నారు. ఇంకొందరు లవ్ ట్రాక్‌లు నడుపుతూ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తున్నారు. ఇంకొందరు తమ గ్లామర్ టాలెంట్‌ను చూపిస్తున్నారు.

గతంతో పోలిస్తే ఈ సారి బిగ్‌బాస్ హౌస్‌లో గ్లామర్ పెరిగింది. అందాల భామలు ప్రేక్షకులను అలరిస్తున్నారు. హౌస్‌లో పొట్టి బట్టలు వేసుకుని సందడి చేయడం సర్వసాధారణం. కానీ కొంత మందికి ఒక్కో కంటెస్టెంట్ మీద ఒక్కో అభిప్రాయం ఉంటుంది. ఆ కంటెస్టెంట్ ఇలా చేయదు.. అలా కనిపించదు.. పద్దతిగా కనిపిస్తుంది.. ఎవరితో గొడవ పడదని అనుకుంటారు. కానీ ఒక్కోసారి ప్రేక్షకుల అంచనాలు తారుమారు అవుతాయి. ఇప్పుడు సింగర్ దామిని విషయంలోనూ అలాందిదే జరిగింది.

బిగ్‌బాస్ షోలో వీక్‌డేస్‌లో కంటెస్టెంట్లు ఎంతో గ్లామరస్‌గా కనిపిస్తుంటారు. పొట్టి పొట్టి డ్రెస్సుల్లో అందాలను ఆరబోస్తుంటారు. అయితే లేడీ కంటెస్టెంట్ల వస్త్రధారణపై ఎప్పుడూ ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది. కెమెరాలు 24 గంటలు లేడీ కంటెస్టెంట్లను గమనిస్తూనే ఉంటాయి. బిగ్‌బాస్ టీమ్ కూడా టీఆర్‌పీ రేటింగ్ కోసం ఎలాంటి వీడియోలు ప్లే చేస్తారో వారికే తెలుసు. అయితే కంటెస్టెంట్లు కూడా తెలిసి అలాంటి బట్టలు వేసుకుంటారా? కావాలనే చేస్తున్నారా? అనేది ప్రత్యేకంగా చెప్పలేము. కానీ కంటెస్టెంట్లు కాస్త స్పృహతో ఉండాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
బిగ్‌బాస్ షో స్టార్ట్ అయి రెండు వారాలు పూర్తి చేసుకుంది. అయితే ఈ సీజన్‌లో దామిని వీడియోలు, ఫోటోలు నెట్టింట ఎక్కువగా ట్రెండ్ అయ్యాయి. మరీ పొట్టి బట్టలు వేసుకుంటోంది. పొట్టి పొట్టి డ్రెస్సుల్లో స్విమ్మింగ్ పూల్‌లో సందడి చేస్తోంది. తాజాగా ఆమె వీకెండ్‌లో కట్టుకున్న చీర, ఆమె ప్రేక్షకులను ఆకట్టుకున్న విధానం, టాలెంట్ చూపించిన తీరును చూసి తెలుగు ఆడియన్స్ షాక్ అవుతున్నారు. ఆమె తీరుపై దారుణంగా ట్రోల్ జరుగుతోంది. బిగ్‌బాస్ టీమ్ కూడా దామిని అందాల ప్రదర్శనపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. వెనకాల కూర్చున్న దామిని కెమెరాకు అనుగుణంగా కూర్చొబెట్టారు. శని, ఆదివారం జరిగిన ఎపిసోడ్‌లలో దామిని ఎక్స్‌పోసింగ్ మరింత ఎక్కువైందని చెప్పవచ్చు.

బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి దామినిపై పెద్దగా వ్యతిరేకత లేదు. కానీ ఇంట్లో వంటలక్కగా సెటిల్ అయిన దానిపై అందరూ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో చాలా మందికి ఆమె టార్గెట్ అయ్యారు. ఇప్పటికే ప్రిన్స్ యావర్, రతిక రోజ్, శోభా శెట్టితో దామిని వ్యతిరేకత ఏర్పడింది. దామిని కూడా తన స్ట్రాటజీతో గేమ్ ఆడుతున్నట్లు తెలుస్తోంది. మొన్నటివరకు అందరితో సింపుల్‌గా కనిపించిన దామిని తన గేమ్ ప్లాన్ ఛేంజ్ చేస్తోంది. వీకెంట్‌లో జరిగిన గేమ్స్‌లో దామిని కూడా స్ట్రాంగ్‌గా ఉంటూ ఆటాడింది. అయితే బిగ్‌బాస్ హౌస్‌లో దామినితో పోలిస్తే మిగిలిన కంటెస్టెంట్లు శోభా శెట్టి, శుభశ్రీ, రతిక రోజ్, ప్రియాంక గ్లామరస్‌గా కనిపిస్తున్నారు. దాంతో దామిని కూడా ఎక్స్‌పోసింగ్ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఇది గేమ్‌లో భాగమా? కావాలనే ఆమె ఎక్స్‌పోసింగ్ చేస్తుందా? అనే విషయంపై క్లారిటీ లేదు. కానీ ఇప్పటివరకు హౌస్‌లో లక్షణంగా కనిపించిన దామినిలో ఈ యాంగిల్ చూసి తెలుగు ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. దీనిని ప్రజలు పాజిటివ్‌గా తీసుకుంటారా? నెగిటివ్‌గా తీసుకుంటారా? అనేది వేచి చూడాల్సిందే..