Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో ఏం జరుగుతుంది అనేది ఎవరు అంచనా వేయలేకపోతున్నారు. గతంలో ప్రసారమైన ఆరు సీజన్లలో హౌస్ నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారు..? హౌస్ లో ఉండే సభ్యుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి..? అనేది చూసే ప్రేక్షకుడికి అర్థమయ్యేది. కానీ సీజన్ సెవెన్ మొత్తం ప్రేక్షకుల ఊహలకు అందని రీతిలో హౌస్ లో బిగ్ బాస్ తీసుకుంటాన నిర్ణయాలు ఇస్తున్న టాస్కులు నెక్స్ట్ లెవెల్ మాదిరిగా ఉన్నాయి. అసలు ఈ సీజన్ సెవెన్ లో పక్క ఎపిసోడ్ కూడా బోర్ అనేది లేకుండా జాగ్రత్త పడటం జరిగింది. సీజన్ సిక్స్ లో హౌస్ లో సభ్యులను ఆడాలి ఆడాలి అంటే ప్రతి వారం నాగార్జున క్లాస్ తీసుకోవడం జరిగేది.
కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండానే.. ప్రతి దానికి టాస్కులు పెడుతూ సీజన్ సెవెన్ పోటీదారులకు చుక్కలు చూపిస్తున్నారు. సీజన్ సగం కంప్లీట్ అయ్యాక గత వారం ఐదుగురు వైల్డ్ కార్డు రూపంలో ఎంటర్ ఇవ్వటం జరిగింది. కాకా శనివారం ఎపిసోడ్లో హౌస్ నుండి ఎలిమినేట్ అయిన ముగ్గురు పాత కంటెస్టెంట్స్.. రతిక, దామిని, శుభశ్రీ హౌస్ లో ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలో ఎలిమినేట్ అయిన ఈ ముగ్గురిలో ఒకరు హౌస్ లోకి వచ్చే విధంగా.. ఓటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ క్రమంలో ఎక్కువ ఓట్స్ వచ్చినవాళ్లు హౌస్ లోకి వస్తారని ఇంటి సభ్యులందరూ వేసిన ఓట్లకు వ్యతిరేకంగా బిగ్ బాస్ ఊహించని నిర్ణయం తీసుకున్నారు.
మేటర్ లోకి వెళ్తే హౌస్ మెట్స్ వేసినా ఓటింగ్ లో తక్కువ ఓట్లు వచ్చిన వాళ్లకే హౌస్ లోకి రియంట్రీ అని ట్విస్ట్ ఇవ్వడం జరిగింది. దీంతో కచ్చితంగా రతిక హౌస్ లోకి మళ్ళీ రాబోతుందని బయట ప్రచారం జరుగుతుంది. ఇదే జరిగితే హౌస్ లో ఇప్పుడు మరో వాతావరణం నెలకొన్నట్లే. అయితే రజక మొదటి వారం మంచిగా గేమ్ ఆడిన తర్వాత పల్లవి ప్రశాంత్ తో గొడవలు పెట్టుకోవడం ఆమెకు పెద్ద మైనస్ అయింది. ఈ క్రమంలో బయట వాతావరణం అంతా తెలుసుకున్న ఆమె ఇప్పుడు హౌస్ లో రీ ఎంట్రీ ఇస్తే పరిస్థితి ఏంటి అనేది హౌస్ లో సభ్యులకు చూసే ప్రేక్షకులకు.. అర్థం కాని ప్రశ్నగా మిగిలిపోయింది. నిజంగా సీజన్ సెవెన్ ఉల్టా పల్టా అని అంటున్నారు.