Bigg Boss 7 Telugu: ఈసారి బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో సీరియల్ బ్యాచ్ లో సభ్యుడు అమర్ దీప్ చాలా నెగిటివ్ ఇంప్రెషన్ సంపాదించుకుంటున్నాడు. ముఖ్యంగా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ పట్ల నోరు జారడంతో పాటు తక్కువ చేసి మాట్లాడుతూ… అమర్ ప్రవర్తిస్తున్న తీరు.. అతని వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా కనిపిస్తూ ఉంది. సింగిల్ గేమ్ ఆడకుండా గ్రూపు గేమ్ ఆలోచనలతో అమర్ ఆట తీరు ఉండటంతో అతనిపై ఈసారి చూస్తున్న ప్రేక్షకులకు నెగిటివ్ ఇంప్రెషన్ ఏర్పడింది. సీజన్ సెవెన్ మొదలయ్యి ఐదు వారాలు కావస్తోంది. ఈ ఐదు వారాలలో ఎక్కడా కూడా అమర్ తన సొంత గేం ఆడిన సందర్భాలు లేవు.
ఎవరైతే కష్టపడి రానిస్తున్నారు వాళ్ల మీద పడి సీరియల్ బ్యాచ్ దగ్గర ఏడవడం తప్ప మనోడు పొడిచింది ఏమి లేదు. పైగా ఇండస్ట్రీలో తనకంటూ ఏదో పాపులారిటీ ఉంది అన్నట్టు గొప్పగా డబ్బా కొట్టే మాటలు చెప్పుకుంటూ వస్తున్నారు. ఇదిలా ఉంటే శనివారం వీకెండ్ ఎపిసోడ్ లో నామినేషన్ టాస్క్ మాదిరిగా ఓ షీట్ పై ఇంటి సభ్యుల బొమ్మలను గీసి ఉన్న కత్తులను గుచ్చుతూ ఐదో వారంలో ఎవరెవరు ఎలా ఆడారో నాగార్జున వివరిస్తూ వచ్చారు. వాటిని గుచ్చితే తప్పు చేసినట్లు గుచ్చకపోతే చేయనట్లు అని ముందుగానే తెలియజేశారు.
ఈ క్రమంలో మిమ్మల్ని చూస్తే మచ్చటేస్తుంది అంటూ ప్రిన్స్, తేజ ఆట తీరును ప్రశంసించారు. అనంతరం సీరియల్ బ్యాచ్ అమర్దీప్, సందీప్ ఆట తీరుపై నాగార్జున ఫుల్ సీరియస్ అయ్యారు. బత్తాయి టాస్క్ లో సందీప్ మోసం చేశాడని వీడియో ప్లే చేసి మరి అతని పరువు తీయడం జరిగింది. ఇప్పుడు సంచలకూడిగా ఉన్న అమరదీప్ పై నాగార్జున తొక్కలో సంచాలక్.. బొక్కలో జడ్జిమెంట్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క అమరదీప్ మాత్రమే కాదు శుభ, ప్రియాంక, శోభ, శివాజీ ఆటతీరులపై మండిపడటం జరిగింది.