Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ పదో వారం ఫ్యామిలీ వీక్ సాగుతోంది. సోమవారం నామినేషన్స్ కంప్లీట్ అయిన తర్వాత.. మంగళవారం నుండి ప్రారంభమైన ఫ్యామిలీ వీక్ లో ఇంటి సభ్యులకు కుటుంబ సభ్యులు మెల్లమెల్లగా ఒక్కొక్కరు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా కొన్ని వారాలు పాటు ఇంటికి దూరం కావడంతో కుటుంబ సభ్యులను చూసి హౌస్ మెట్స్ కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇప్పటికే శివాజీ, అర్జున్, గౌతమ్, అశ్విని తల్లిదండ్రులు రావడం జరిగింది. గురువారం ఎపిసోడ్ లో అమర్ దీప్ భార్య శోభా శెట్టి తల్లి వచ్చారు. అంతేకాదు యావర్ వాళ్ళ అన్నయ్య కూడా రావటం జరిగింది.
ఈ క్రమంలో శోభా శెట్టి తన తల్లిని చూసి.. ఆనందంతో కేకలు వేసింది. అనంతరం కన్నీళ్లు పెట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత శోభ తల్లి హౌస్ లో అందరిని కౌగిలించుకుని ప్రేమను చూపించారు. ఇదే సమయంలో యావర్ కి ఊహించని సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వటం జరిగింది. విషయంలోకి వెళ్తే యావర్ నీ కౌగిలించుకుని నేను మీ అమ్మలానే… నువ్వు నా కొడుకువే అంటూ యావర్ తల్లి ఫోటోను ఇవ్వటంతో ఎమోషనల్ అయ్యాడు. ఆ వెంటనే శోభా తల్లి కాళ్ళ మీద పడటం జరిగింది.
అనంతరం కూతురు శోభా కి పలు సూచనలు చేస్తూ నీ కోపం తగ్గించుకోవాలి. నీ కోపం గురించి మాకు తెలుసు ఇంట్లో ఉన్న సభ్యులకు తెలియదు కదా అంటూ.. బాగా ఆడాలి గెలవాలి అని.. ధైర్యంగా ఉండాలని తెలపడం జరిగింది. చివరిలో యావర్ అన్నయ్య కూడా హౌస్ లోకి రావడం జరిగింది. తన తమ్ముడికి తనకి తల్లి ప్రేమ అంతగా తెలియదని అతను కూడా.. కన్నీరు పెట్టుకున్నాడు. శివాజీని పట్టుకొని ఏడవడం జరిగింది. మొత్తం మీద చూసుకుంటే ఈ ఫ్యామిలీ వీక్ లో హౌస్ లో సందడి వాతావరణం కూడా నెలకొంది.