Bigg Boss 7 Telugu: తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ రసవత్తరంగా సాగుతోంది. మరో మూడు వారాల ఆట మాత్రమే మిగిలి ఉంది. ఈసారి సీజన్ నీ చూసే ఆడియన్స్ కి హౌస్ లో ఆడే సభ్యులకు ఊహించని రీతిలో ట్విస్ట్ లు ఇస్తూ బిగ్ బాస్ గేమ్ ఆడించారు. ప్రారంభంలో ఉన్నట్టు మాదిరిగానే ఉల్టా పుల్టా రీతిగానే… గేమ్ ఉండటం జరిగింది. ఈ క్రమంలో హౌస్ లో ప్రారంభంలో 14 మంది సభ్యులు తర్వాత వైల్డ్ కార్డు రూపంలో ఐదుగురు సభ్యులు మొత్తం 19 మంది సభ్యులు టైటిల్ కోసం పోటీ పడటానికి హౌస్ లో అడుగుపెట్టగా ప్రస్తుతం హౌస్ లో 10 మంది మిగిలారు. వచ్చేవారం డబల్ ఎలిమినేషన్. ఈ క్రమంలో 12వ వారం ఆట నామినేషన్ ప్రక్రియ రసవతరంగా సాగుతుంది.
పరిస్థితి ఇలా ఉంటే తాజాగా బిగ్ బాస్ షోపై సీపీఐ నారాయణ… మండి పడటం జరిగింది. బిగ్ బాస్ హౌస్ బ్రోతల్ హౌసేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి సంబంధం లేని 20, 30 మంది ఒకే ఇంట్లో ఉండటం ఏంటి..? దీనిని ఏమనాలి..? బిగ్ బాస్ నాకు అనైతికంగా అనిపించింది. ఉద్దేశపూర్వకంగా నేను వివాదం చేయడం లేదు.. అని వ్యాఖ్యానించారు. ఇప్పుడే కాదు గతంలోనూ ఈ షోపై నారాయణ విమర్శలు చేయడం జరిగింది. షోలో అశ్లీలత ఉందని టాస్కులు పేరిట.. అసభ్యకరమైన కంటెంట్ ను ప్రోత్సహిస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
అప్పట్లో హోస్ట్ నాగర్జున పై కూడా విమర్శలు చేయడం జరిగింది. అంతేకాదు కోర్టులకు వెళ్లి షో ప్రసారం కాకుండా అడ్డుకుంటానని కూడా హెచ్చరించడం జరిగింది. బిగ్ బాస్ షో సమాజానికి హానికరమని, ఈ షో ద్వారా ఆ షో నిర్వాహకులు ఎలాంటి సందేశం ఇస్తున్నారు అంటూ.. అప్పట్లో నారాయణ కామెంట్లు చేయడం జరిగింది. కాగా ఇప్పుడు మరోసారి ఈ రియాల్టీ షోపై సీపీఐ నారాయణ.. విమర్శలు చేయడం సంచలనంగా మారింది.