Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్ మొత్తం ఎమోషనల్ వాతావరణం నెలకొంది. పదో వారం గేమ్ షోలో సోమవారం మినహా మంగళవారం నుండి ఫ్యామిలీ వీక్ స్టార్ట్ అయింది. హౌస్ లో సభ్యులు చాలా రోజుల తర్వాత కుటుంబ సభ్యులను.. చూడటంతో హౌస్ మెట్స్ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ క్రమంలో శుక్రవారం పల్లవి ప్రశాంత్ తండ్రి బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా ప్రశాంత్ తండ్రి హౌస్ సభ్యులను ఆప్యాయంగా పలకరించటం జరిగింది. ఈ క్రమంలో శివాజీ నీ ఆప్యాయంగా పలకరించి.. కన్న కొడుకు లాగా నా కొడుకును చూసుకున్నావు అని అన్నారు.
ఇక ఇదే సమయంలో పల్లవి ప్రశాంత్ కి ఆటలో కొన్ని సూచనలు ఇచ్చే ధైర్యం చెప్పడంతో పాటు పొలంలో పండించిన బంతిపూలను తీసుకొచ్చారు. మనలో ఉన్న టాలెంట్ సరిగ్గా ఉపయోగించుకోవాలని కొడుకుకు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో ప్రశాంత్ కన్నీరు పెట్టుకోవడంతో అసలు ఏడవద్దు అని.. నిన్ను చూసి బయట అమ్మాయి ఏడుస్తుందని ఆమెకు బీపీ పెరిగే అవకాశం ఉందని.. ప్రశాంత్ తండ్రి కామెంట్లు చేశారు. బాగా ఆడి గెలవాలని సూచించారు. ఇదే సమయంలో అమర్ తో మాట్లాడుతూ.. అనవసరంగా గొడవలు వద్దని సూచించారు. బిగ్ బాస్ హౌస్ లో పల్లవి ప్రశాంత్ బ్యాగ్రౌండ్ లేకుండానే ఎంట్రీ ఇచ్చారు.
రైతు బిడ్డ అనే ట్యాగ్ తో ఎంట్రీ ఇచ్చి అందరి దృష్టిని ఆకట్టుకోవడం జరిగింది. ఒక యూట్యూబర్ గా అంతకుముందు.. పాపులారిటీ అందుకున్నాడు. ఎంతో కష్టపడి బిగ్ బాస్ లోకి ఎంట్రీచి తన కలను నెరవేర్చుకున్నాడు. ప్రశాంత్ ఆట తీరు బిగ్ బాస్ షో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. టైటిల్ గెలిచే వారిలో మొదటి వరుసలో ప్రశాంత్ పేరు వినబడుతోంది. ఫిజికల్ టాస్కుల పరంగా ఇతరులతో మాట్లాడే విషయంలో చాలా జాగ్రత్తగా గేమ్ ఆడుతూ ఉన్నాడు. ప్రారంభంలో సింపతి గేమ్ అని అందరూ విమర్శలు చేయగా తర్వాత తన ఆట తీరు మార్చుకొని ప్రస్తుతం అద్భుతంగా ప్రశాంత్ అద్భుతమైన గేమ్ ఆడుతూ రాణిస్తున్నారు.