Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ అన్ని రకాలుగా అందరిని ఆకట్టుకుంటూ ఉంది. గత సీజన్లకు భిన్నంగా ఈ సీజన్ సెవెన్ అందరినీ ఆకట్టుకుంటూ ఉంది. గతంలో మాదిరిగా కాకుండా ప్రేక్షకుల అంచనాలను తలకిందులు చేస్తూ ట్విస్ట్ లు మీద ట్విస్ట్ లు ఇవ్వడం జరిగింది. వాయిస్ రికార్డు రూపంలో ఐదుగురు సభ్యులు ఎంట్రీ ఇవ్వడం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ఒక లు హౌస్ లోకి రావటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం పదోవారం గేమ్ సాగుతోంది. ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్ సాగగా శుక్రవారం.. కెప్టెన్సీ టాస్క్ స్టార్ట్ అయింది. “హో బేబీ” టాస్క్ నిర్వహించటం జరిగింది. హౌస్ లో ఉన్న ప్రతి ఒక్కరి మొక్కల ఫోటోలు ఉన్న బేబీ ఫోటోలు ఉంటాయని బజార్ గా బేబీ ఏడుపు వినపడగానే హౌస్ లోని అందరు పరిగెత్తుకు వెళ్లి బేబీని పట్టుకుని గార్డెన్ లో ఓ మూలాన ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ లోపలికి వెళ్లాలి రూల్.
చివరిగా ఎవరైతే లోపలికి వెళ్తారో వారి చేతిలో ఉన్న బేబీ నీ స్టోర్ రూమ్ లో పెట్టాలని చెప్పడం జరిగింది. అయితే ఈ గేమ్ లో ఎవరికి వారు తమ వ్యూహాలు వేసుకోగా చివరకు శివాజీ అర్జున్ ఇద్దరే మిగులుతారు. ప్రారంభంలో అమర్, ప్రిన్స్, యావర్ అద్భుతమైన గేమ్ ఆడటం జరిగింది. కానీ ఎవరికి వారు వేసిన స్ట్రాటజీలకు చివరి వరకు రాణించలేకపోయారు. ఈ క్రమంలో డాక్టర్ బాబు గౌతమ్.. తన ఓటమికి కారణం శివాజీనే అంటూ ఇష్టానుసారంగా మాట్లాడటం జరుగుద్ది. దీంతో అంతవరకు ఎంతో ఓపికగా ఉన్న శివాజీ ఒక్కసారిగా గౌతమ్ పై సీరియస్ అవుతాడు. హౌస్ లో మీరే బిగ్ బాస్ మాదిరిగా ఆడుతున్నారంటూ గౌతమ్ మండి పడటం జరిగింది.
అందరీ ఆట మీరే ఆడుతున్నారనేప్పటికీ శివాజీ ఒక్కసారిగా నీ బాధ ఏంటి అంటూ గౌతమ్ మీదకి వెళ్లి.. ఊహించని విధంగా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఇదే సమయంలో గౌతం కూడా తగ్గకుండా శివాజీ మీదకి వెళ్ళిపోతాడు. ఒకానొక దశలో ఇద్దరు కొట్టుకునే దాకా వెళతారు. ఈ ఆవేశంలో గౌతమ్ మైకు తీసేసి… డోర్ ఓపెన్ చేయండి వెళ్ళిపోతాను అంటూ బిగ్ బాస్ కి గౌతమ్ మొఱ్ఱ పెట్టుకుంటాడు. ఈ క్రమంలో కెప్టెన్ శోభ… కలుగజేసుకుని గౌతమ్ ను కూల్ చేయడం జరిగింది. పదోవారం కెప్టెన్సీ టాస్క్ లో శివాజీ గౌతమ్ గొడవ.. సంచలనంగా మారింది.