Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం నుండి రసవత్తరంగా సాగుతుంది. హౌస్ మేట్స్ కి ఎక్కడ ఖాళీ లేకుండా టాస్కుల మీద టాస్కులు పెడుతున్నారు. ప్రజెంట్ 5 వారాల ఇమ్యూనిటీ పవర్ కి సంబంధించిన పోటీలో ఇంటి సభ్యులు భారీగా పోటీ పడుతున్నారు. అయితే మొదటి వీకెండ్ కావడంతో నేడు నాగార్జున హౌస్ మేట్స్ ని కలవబోతున్నారు. ఈ క్రమంలో ఎవరికి వార్నింగ్ లు… ఎవరిని పొగుడుతారు అనేది సస్పెన్స్ గా మారింది. ఇదిలా ఉంటే హౌస్ లో శుక్రవారం ఎపిసోడ్ లో నటి షకీలా వ్యవహరించిన తీరు అందరికి చిరాకు తెప్పించింది. దెయ్యం పట్టినట్టు ఆక్ట్ చేసి ఇంటి సభ్యులందరినీ భయభ్రాంతులకు గురిచేసింది. హౌస్ లో తనకి బోర్ కొడుతుందని శివాజీ దగ్గర మాట్లాడుతూ ఏదో ఒకటి చేయాలంటూ దెయ్యం ప్రంక్ చేయడం జరిగింది.
దీంతో గట్టి గట్టిగా అర్ధరాత్రి అరవటంతో పడుకున్న ఇంటి సభ్యులందరూ ఒక్కసారిగా భయపడి పారిపోయారు. ఆ తర్వాత షకీలా దగ్గరకి శివాజీ వచ్చి ఆమెను ఓదారుస్తున్నట్లు చేయడం జరిగింది. దెయ్యం ప్రాంక్ అడ్డం తిరగడంతో తోటి లేడీ కంటెస్టెంట్ డామిని వద్ద షకీలా చేసిన వ్యాఖ్యలు చూసే ఆడియన్స్ కి చిరాకు తెప్పించాయి. ఈ వంక పెట్టుకుని ఒకవేళ హౌస్ మేట్స్ వచ్చేవారం నామినేట్ చేస్తే.. భయాన్ని విడిచిపెట్టను అంటూ పరోక్షంగా శివాజీపై కామెంట్లు చేసింది. అసలు బోర్ కొడుతుంది.. ఏదో ఒకటి చేద్దాం అని శివాజీ దగ్గర షకీలా డిస్కషన్ పెట్టింది. ఈ క్రమంలో దయ్యం ప్రాంక్ చేద్దామని.. శివాజీ.. ఐడియా మాత్రమే ఇచ్చారు.
అయితే చేయాలా వద్దా అనేది షకీలా తీసుకోవాల్సిన నిర్ణయం. ఆమె చేసేసి తర్వాత శివాజీ మీద నెట్టేసి.. విమర్శించటం ఏం బాగోలేదని శుక్రవారం ఎపిసోడ్ లో షకీలా తీరుపై జనాలు నెగటివ్ కామెంట్లు చేస్తున్నారు. ఒకవేళ టాస్క్ పండి ఉంటే.. క్రెడిట్ ప్లస్ పాయింట్స్ ఈవిడకి కావాలి. మైనస్ అయితే మాత్రం మొత్తం అవతల వ్యక్తిపై తోసేయాలి అన్నట్టు షకీలా దయ్యం ప్రాంక్ లో వ్యవహరించిందని మండిపడుతున్నారు. ఈ రకమైన ఆలోచన కలిగిన కంటెస్టెంట్ హౌస్ లో రాణించలేరని విమర్శిస్తున్నారు.