Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో కంటెస్టెంట్ అమర్ అందరికీ సుపరిచితుడే. మాటీవీలో ఎన్నో సీరియల్స్ ద్వారా అలరించి ఇప్పుడు బిగ్ బాస్ షోలో రాణిస్తున్నాడు. ప్రారంభంలో ఫుల్ నెగిటివిటీ క్రియేట్ చేసుకున్నా మర్రి ఇప్పుడు కొద్ది కొద్దిగా మార్పు చెందుతూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. స్టార్టింగ్ లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ నీ అమర్ గట్టిగా టార్గెట్ చేసి జనాలు ముందు నెగిటివ్ అయ్యాడు. కొన్ని సందర్భాలలో కాని పదాలు కూడా మాట్లాడటం జరిగింది. ఇంత ప్రారంభంలో అమర్ పై చాలా విమర్శలు ఇంటి సభ్యులు చేయడం జరిగింది. ప్రజెంట్ మాత్రం తన ఆట తీరు మార్చుకుంటూ తెలివిగా గేమ్ ఆడుతున్నాడు.
గతంలో మాదిరిగా సీరియల్ బ్యాచ్ దగ్గర కూర్చుని ఇతరులపై విమర్శలు చేయటం కాసా తగ్గించాడు. ఇదిలా ఉంటే కొద్ది నెలల క్రితమే అమర్ తేజస్విని అనే నటిని వివాహం చేసుకోవడం జరిగింది. తాజాగా అమర్ భార్య తేజస్విని ఓ ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె అమర్ ఆట తీరు పట్ల సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రారంభంలో ఐదు వారాలు అమర్ చాలా ఇబ్బంది పడ్డారు. కానీ ప్రస్తుతం మాత్రం అతని ఆటతీరులో చాలా మార్పులు రావడం జరిగాయి.
కానీ అమర్ పట్ల నెగటివ్ కామెంట్స్ వస్తుంటే.. చాలామంది ఎందుకు మీరు స్టాండ్ తీసుకోవటం లేదని అడిగారు. అయితే బూతులు తిడుతుంటే బయటకు వచ్చి అలా మాట్లాడగలను అని చెప్పుకొచ్చారు. కానీ నేను చెప్పాలనుకుంటుంది ఒకటే హౌస్ లో ఒకసారి కొట్టుకుంటారు మరొకసారి కలిసిపోతారు. అలాంటి వాటిని దృష్టిలో పెట్టుకుని బయట ఇంటిలో కుటుంబ సభ్యులను విమర్శించటం సరికాదు. నీళ్లలో ఉన్న మహిళల పట్ల ఎవరైనా ఇలా ప్రవర్తిస్తే ఎలా ఉంటుందో మా బాధ కూడా అలాగే ఉంటుంది అంటూ అమర్ భార్య తేజస్విని ఇంటర్వ్యూలో ఎమోషనల్ గా మాట్లాడింది.